తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ల సమావేశం
సూర్య డిచ్ పల్లి : తెలంగాణ యూనివర్సిటీలో జాతీయ సేవా పథకం (NSS) ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా TSA హైబ్రిడ్ అకౌంట్ విధానం అమలు, ఖాతాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ NSS కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని ప్రోగ్రామ్ ఆఫీసర్లకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఖాతాల నిర్వహణ, నిధుల వినియోగం చేపట్టాలని పేర్కొన్నారు.తెలంగాణ యూనివర్సిటీ NSS కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కె. అపర్ణ మాట్లాడుతూ, NSS కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణకు ప్రోగ్రామ్ ఆఫీసర్ల మధ్య సమన్వయం, బాధ్యతాయుతమైన నిర్వహణ ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అతిథులు,ప్రొఫెసర్, రిజిస్టర్ ఎం.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.