BREAKING
చైనా ఏఐ స్టాక్స్‌లో 1.7 ట్రిలియన్ డాలర్ల భారీ పతనం: ఒకప్పటి హాట్ ట్రేడ్ కాస్తా మదుపర్లకు నష్టాల ఊబిగా మారిన వైనం! ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో ఉత్కంఠ ఆగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లకు గుడ్ న్యూస్*నవంబర్ 25 నుంచి కొత్తగూడెంలో ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ, నమోదు ప్రక్రియ ప్రారంభం* భారత ఐటీ కంపెనీలు ఏఐ వల్ల అంతరించిపోతాయన్న ప్రచారాన్ని తోసిపుచ్చిన రాజీవ్ ఠక్కర్ క్యూ3 ఫలితాలు క్యూ2 స్థాయిలో ఉండకపోవచ్చు: మార్కెట్ నిపుణుడు రాఘవేంద్ర నాథ్ హీరో ఫిన్‌కార్ప్ భారీ విస్తరణ ప్రణాళిక… గేదె పాలపై రూ.6, ఆవు పాలపై రూ.4 పెంచిన 'గోకుల్' డెయిరీ: సేకరణ ధరల పెంపు నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం,,, బంగారం, లోహాల పతనం కొనసాగుతుందా? యూఎస్ కోర్ పీసీఈ ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్లపైనే మదుపర్ల దృష్టి! క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 91 డాలర్లు భారత్‌కు ఎందుకు ప్రమాదకరం? చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి: సర్పంచ్ మండల కృష్ణ ఈ వారం డివిడెండ్ స్టాక్స్ అలర్ట్... చింతలమానేపల్లి ఎస్సై గా స్వరూప్ రాజ్ గల్ఫ్ గగనతలంలో అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశామన్న ఇరాన్ గ్రామ అభివృద్ధి..పేదల సంక్షేమమే ధ్యేయం.. ఆదరించండి.. అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఎల్లసిరి సర్పంచ్ అభ్యర్థి పోచారెడ్డి సుకుమార్ రెడ్డి..

సర్పంచ్ కాదు నిజమైన ప్రజాసేవకురాలు

Select Suryaa Now
సర్పంచ్ కాదు నిజమైన ప్రజాసేవకురాలు

పార పట్టి రోడ్డు శుభ్రం చేసిన ప్రజాసేవకురాలు పగడాల రమాదేవి..

దమ్మపేట, సూర్య (మేజర్ న్యూస్) :  బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రజా సమస్యలపై మెరుపు వేగంతో స్పందిస్తూ, నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా శ్రమిస్తున్న దమ్మపేట స్థానిక సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు సేవాతత్పరత, నిబద్ధత మరోసారి నిరూపితమయ్యాయి. నిగర్విగా, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ఆమె, తాజాగా మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఒక ప్రమాదకర సమస్యపై తక్షణమే స్పందించి తానే స్వయంగా రంగంలోకి దిగి ప్రశంసలు అందుకున్నారు. ఎయిర్‌టెల్ టవర్ నుంచి మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్లే రహదారిని మందుబాబులు అడ్డాగా మార్చుకుని, తాగి పారేసిన మద్యం సీసాలను రోడ్డుపైనే పగలగొట్టి ఉన్మాదం ప్రదర్శించారు. పవిత్రమైన ఆలయానికి వెళ్లే దారిలో, నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే మార్గంలో ఇలాంటి వికృత చేష్టల వల్ల కాలినడకన వెళ్లే భక్తులతో పాటు మూగజీవాల కాళ్లు తెగిపోయే ప్రమాదకర పరిస్థితి ఏర్పడటంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రంగంలోకి దిగారు.

సమాచారం అందుకున్న వెంటనే రమాదేవి గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సాధారణంగా అధికారులు లేదా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి వదిలేసే సంస్కృతికి భిన్నంగా, ఆమె ప్రజల భద్రత కోసం తానే స్వయంగా చేతుల్లోకి పార తీసుకున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్డుపై విస్తరించిన గాజు ముక్కలను స్వహస్తాలతో ఏరివేస్తూ పారిశుధ్య కార్మికురాలిగా మారిపోయారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా ఎలాంటి అహంభావం లేకుండా ఆమె స్వయంగా చెత్తను శుభ్రం చేయడం అక్కడి వారిని ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది. ఆ తర్వాత పంచాయతీ సిబ్బందిని రంగంలోకి దించి, జెసిపి  యంత్రం సహాయంతో ఆ ప్రాంతంలో మిగిలిపోయిన వ్యర్థాలను, ప్రమాదకరమైన గాజు ముక్కలను పూర్తిగా ప్రక్షాళన చేయించారు.

భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తానే స్వయంగా శ్రమించి, ఆ దారినంతటినీ అద్దంలా శుభ్రం చేయించిన ప్రజాసేవకురాలు రమాదేవి సేవాతత్పరతపై దమ్మపేట ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా స్పందించి ఆదర్శంగా నిలిచిన ఆమె చొరవను మండలంలోని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఇలాంటి పవిత్ర స్థలాల్లో మద్యం తాగుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఆకతాయిల ఆటకట్టించాలని, వారిని గుర్తించి పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.