BREAKING
ఏఐ దుర్వినియోగంపై నటి సునైనా ఆవేదన.. ఆన్‌లైన్ వేధింపులపై పోరాడాలని అభిమానులకు పిలుపు! ఐడీబీఐ దేశవ్యాప్త సమ్మెకు పిలుపు .. తలసేమియా రోగులకు హైదరాబాద్ పోలీసుల రక్తదానం టెన్యూర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి.. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా కోటేశ్వరరావు కు MCCBA వినతి పత్రం. ఎన్నికల విధుల్లో సమన్వయంతో పనిచేయాలి: సీఐ వాసునాయుడు థియేటర్లలో ఆకట్టుకోలేక సైలెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'! అమెరికాలో మోస్తరుగా పెరిగిన కార్మిక వ్యయాలు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రమదానం...... ఎన్నికల ప్రక్రియపై సమీక్ష హరీష్ రావు చేతుల మీదుగా ‘డోస్ స్పెషాలిటీ కాఫీ’ షాపు ప్రారంభం కెనడా ఆర్థిక వ్యవస్థకు భారీ షాక్ మోహన్‌లాల్ సన్నివేశాలు కట్ చేయడంపై మలయాళ ప్రేక్షకుల అసంతృప్తి.. బహిరంగంగా అంగీకరించిన 'జైలర్ 2' నిర్మాత! పంట నష్ట వివరాలను రైతులే నమోదు చేసుకునే అవకాశం కళా ప్రతిభకు వేదికగా ‘సాధన 2026’ సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళల్లో గీతం విద్యార్థుల ప్రతిభాప్రదర్శన కాంగ్రెస్ పార్టీలో యాదవులకు ఇప్పటివరకు ఎమ్మెల్సీ అవకాశం దక్కలేదు.... యాదవ హక్కుల పోరాట సమితి.

పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం - ఆడే గజేందర్

Select Suryaa Now
పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం - ఆడే గజేందర్
సూర్య.నేరడిగొండ: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండ మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారు గౌసియా బేగం ఆహ్వానం మేరకు, నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన గౌసియా బేగం కుటుంబ సభ్యులకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. వారి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.అనంతరం ఆడే గజేందర్ మాట్లాడుతూ... అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇల్లు అనేది పేద కుటుంబాలకు కేవలం నివాసం మాత్రమే కాదని, అది వారి ఆత్మగౌరవానికి, భవిష్యత్ భరోసాకు ప్రతీక అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆడెపు శ్రీకాంత్, ఉప సర్పంచ్ మమత చంద్రశేఖర్, సీనియర్ నాయకులు బుక రాములు, నాయుడు రవి, కుంట శంకర్, కార్తీక్, ఆసిఫ్, కళ్ళెం రామకృష్ణ, ఇక్బాల్, తెడ్డు అశోక్, ఇబ్రహీం, రాహిల్ మాలిక్, ప్రవీణ్, అఖిల్, గంధం నవీన్, అశోక్, షకీల్, మినహాజ్, షేక్ రాహిల్ తదితరులు పాల్గొన్నారు.