పాత్రికేయుడు సింగారం ప్రకాష్‌కు ఘన సన్మానం :
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి :
భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ సీనియర్ పాత్రికేయుడు సింగారం ప్రకాష్‌కు మీడియా మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ ఆత్మీయ సత్కారం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కపిల్ వాగ్మారే, వార్త విలేకరి కారండే గంగాధర్, వార్డు సభ్యుడు వాగ్మారే శుద్ధోదన్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యుడు కస్తూరే జైపాల్, సింగిల్ విండో చైర్మన్ అంబేకర్ సాయి తదితరులు పాల్గొన్నారు.