BREAKING
19వ డివిజన్‌లో నియాజ్ అహ్మద్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి..ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గ 350 మందితో భారీ ర్యాలీ.. టీడీపీ అభ్యర్థికి నాయకుల మద్దతు పోలీసుశాఖ అందించే సేవలపై అవగాహన కల్పించేందుకే 'ఓపెన్ హౌస్' చిన్నారులను ఆశీర్వదించిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఓటీటీలోకి వచ్చేసిన మరో తెలుగు సినిమా.. సైలెంట్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఐ యామ్ హ్యాండ్‌సమ్! భూసేకరణపై సమగ్ర విచారణ జరపాలి.. సీఎం జోక్యం చేసుకోవాలి: టీడీపీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు ఫామ్ పాండ్ల నిర్మాణంతో భూగర్భ జలాల పెంపు, రైతులకు అదనపు ఆదాయం - జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పోలింగ్ సిబ్బంది కి 28న ఫెసిలిటేషన్ సెంటర్.. * జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి * ఓటీటీలో అలరిస్తున్న సరికొత్త మలయాళ థ్రిల్లర్ ధూమకేతు సినిమా పూర్తి రివ్యూ! నీటి సంరక్షణపై కూలీలకు అవగాహన శ్రీ కార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ ప్రాజెక్ట్.. ఆకట్టుకుంటున్న తారా అనౌన్స్‌మెంట్ వీడియో! పేరుకుపోతున్న చెత్త - డ్రైనేజీ నుంచి దుర్వాసన కూటమి ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెబుదాం* - నగరాన్ని నాశనం చేసేందుకే బీజేపీ ఎత్తుగడలు - కూటమి ప్రభుత్వ ఆపద్దపు హామీలను నమ్మకండి - అనంతపురం నగరాన్ని కాపాడుకుందాం.. - వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్, సీపీఐ నాయకులు *పైడితల్లి అమ్మవారి ప్రసాదాల తయారీని పరిశీలించిన ఆహార భద్రతాధికారులు ప్రభుత్వ సలహాదారుని కృషితో ఆర్టీసీ బస్సు సౌకర్యం

నారాయణపేట పోలీసులకు వ్యాసరచన పోటీలు

Select Suryaa Now
నారాయణపేట పోలీసులకు వ్యాసరచన పోటీలు

*నారాయణపేట, సూర్యన్యూస్* :   పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని నారాయణపేట జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి శుక్రవారం వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు అదనపు ఎస్పీ ఎం.డి. రియాజ్ ఉల్ హక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్టోబర్ 21 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విధి నిర్వహణలో సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసు వ్యవస్థలో ప్రజాసేవ, వృత్తిపరమైన నైపుణ్యం, సామాజిక బాధ్యత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై పోలీసు అధికారులు, సిబ్బందిలో అవగాహన పెంపొందించడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కాగా పోలీసు సిబ్బందికి రెండు కేటగిరీలుగా వ్యాసరచన పోటీలను నిర్వహించామని, మొదటి కేటగిరీలో కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు పనిచేస్తున్న సిబ్బందికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు పోలీసుల నుంచి ఎలాంటి సేవలను ఆశిస్తారు?, పోలీసు అధికారుల జీవితాల్లో సోషల్ మీడియా పాత్ర – సోషల్ మీడియాకు బానిస కాకుండా వ్యక్తిగత, సామాజిక ప్రయోజనాల కోసం దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి?  అనే అంశాలను కేటాయించామన్నారు. ఇక రెండవ కేటగిరీలో ఎస్సై నుంచి పైస్థాయి అధికారుల వరకు పనిచేస్తున్న అధికారులకు పౌరుల మన్ననలు పొందడానికి పోలీసులు చేయవలసిన కృషి ఏమిటి?, క్షేత్రస్థాయిలో పోలీసింగ్ వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలి?” అనే అంశాలపై వ్యాసరచన పోటీలను నిర్వహించామన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారి వ్యాసాలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది రాణించి రాష్ట్రస్థాయిలో బహుమతులు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ విజయ్ భాస్కర్, ఎస్ఐలు కృష్ణ చైతన్య, శిరీష, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.