BREAKING
నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన.

కూటమి ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెబుదాం* - నగరాన్ని నాశనం చేసేందుకే బీజేపీ ఎత్తుగడలు - కూటమి ప్రభుత్వ ఆపద్దపు హామీలను నమ్మకండి - అనంతపురం నగరాన్ని కాపాడుకుందాం.. - వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్, సీపీఐ నాయకులు

Select Suryaa Now
కూటమి ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెబుదాం*   - నగరాన్ని నాశనం చేసేందుకే బీజేపీ ఎత్తుగడలు  - కూటమి ప్రభుత్వ ఆపద్దపు హామీలను నమ్మకండి  - అనంతపురం నగరాన్ని కాపాడుకుందాం..  - వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్, సీపీఐ నాయకులు

అనంతపురంబ్యూరో (అనంతపురంబ్యూరో, మేజర్ న్యూస్) : కూటమి ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెబుదామని అనంతపురం నగర మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్, సీపీఐ నాయకులు జగదీష్, జాఫర్‌లు అన్నారు. శుక్రవారం సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నగరంలో మేయర్, ఎంపీ, ఎమ్మెల్యేలు మూడు ముక్కలాటాడుతూ నగరాన్ని నాశనం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కోవిడ్, వరదలు వచ్చినప్పటికీ సంక్షేమం ఎప్పటికీ ఆగలేదన్నారు. ప్రజల ఓట్లతో గెలిచి సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వ నాయకులు పక్కన పెట్టారన్నారు.

 

 నగర ప్రజలందరూ కలిసి కూటమి ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పే రోజు వచ్చిందన్నారు. సీపీఐ, సీపీఎం, వైసీపీ కలిసి అనంతపురం నగరాన్ని కాపాడుకుందామన్నారు. ఢిల్లీ గర్వానికి.. అనంతపురం ఆత్మవిశ్వాసానికి జరుగుతున్న పోరాటం ఇది అన్నారు. బిజెపి ప్రభుత్వం అనంతపురం నగరాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లలో అనంతపురం నగరాన్ని నాశనం చేసిందన్నారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎన్నికల ముందు ధర్మవరం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను పక్కనపెట్టి.. మళ్లీ మోసం చేసేందుకు అనంతపురానికి కొత్త హామీలు తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు.

 

 డంపింగ్ యార్డ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అని అబద్ధపు హామీలు ఇచ్చి అనంత నగర ప్రజలను మోసం చేయొద్దని సూచించారు. అనంతపురం నగర ప్రజల రుణం తీర్చుకునేందుకు వైసీపీ మేయర్ అభ్యర్థిగా  తనకు నియమించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. 

అనంతరం సీపీఐ నాయకులు జగదీష్ తదితరులు మాట్లాడుతూ..* సీఎం చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు అడ్డం పెట్టుకుని నామినేషన్ వేయకుండా ఏవిధంగా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారన్నారు.

 

 మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఏవిధంగా ఉంటుందో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తెలుసుకోవాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద గంజాయి, రౌడీలను పెట్టించి నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన వారిపై దాడులు చేయడం తగదన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపితే.. కూటమి ప్రభుత్వం ఓడిపోతుందన్న భయంతో వైసీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు నామినేషన్ వేయనీకుండా చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను చూసిన ప్రజలు వారికి ఓటు వేయరన్న ఉద్దేశంతోనే బిజెపి అభ్యర్థిని ఇక్కడ పెట్టారని, అయితే ప్రశాంతతకు మారుపేరైన అనంతపురం నగరాన్ని కుల, మత కల్లోలాలు సృష్టించేందుకే బీజేపీ అభ్యర్థిని ఇక్కడ పెట్టారన్నారు. అన్ని పార్టీల నాయకులంతా ఏకతాటిపై ఉంటూ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు.  సమష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌తోపాటు 60 వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు, 2 సీపీఐ, సీపీఎం కార్పొరేటర్ అభ్యర్థులను కూడా గెలిపించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.  కార్యక్రమంలో సీపీఐ నాయకులు నారాయణస్వామి, మల్లికార్జున, రాజారెడ్డి, శ్రీరాములు, రాజేష్ గౌడ్, కృష్ణుడు, లింగమయ్య, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.