BREAKING
డీసీసీ అధ్యక్షుడిగా ధారాసింగ్ నాయక్‌కు ఏడాది పూర్తి.. పెద్దేముల్ మండల కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి కొందుర్గు (రంగారెడ్డి): ప్రతి ఎన్.నగరం సర్పంచ్ బరిలో లక్ష్మీదేవమ్మ, గాయత్రి ఎంపీడీవో కార్యాలయంలో వేర్వేరుగా నామినేషన్ల దాఖలు తరలివచ్చిన గ్రామస్థులు, మద్దతుదారులు.. సందడిగా మారిన పరిసరాలు రావల్ కోల్‌లో ఓవర్‌లోడ్ వాహనాల బీభత్సం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం పుట్టపర్తికి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ చైనా ఏఐ స్టాక్స్‌లో 1.7 ట్రిలియన్ డాలర్ల భారీ పతనం: ఒకప్పటి హాట్ ట్రేడ్ కాస్తా మదుపర్లకు నష్టాల ఊబిగా మారిన వైనం! ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో ఉత్కంఠ ఆగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లకు గుడ్ న్యూస్*నవంబర్ 25 నుంచి కొత్తగూడెంలో ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ, నమోదు ప్రక్రియ ప్రారంభం* భారత ఐటీ కంపెనీలు ఏఐ వల్ల అంతరించిపోతాయన్న ప్రచారాన్ని తోసిపుచ్చిన రాజీవ్ ఠక్కర్ క్యూ3 ఫలితాలు క్యూ2 స్థాయిలో ఉండకపోవచ్చు: మార్కెట్ నిపుణుడు రాఘవేంద్ర నాథ్ హీరో ఫిన్‌కార్ప్ భారీ విస్తరణ ప్రణాళిక… గేదె పాలపై రూ.6, ఆవు పాలపై రూ.4 పెంచిన 'గోకుల్' డెయిరీ: సేకరణ ధరల పెంపు నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం,,, బంగారం, లోహాల పతనం కొనసాగుతుందా? యూఎస్ కోర్ పీసీఈ ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్లపైనే మదుపర్ల దృష్టి! క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 91 డాలర్లు భారత్‌కు ఎందుకు ప్రమాదకరం?

నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీస్తామన్న కేటీఆర్

Select Suryaa Now
నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీస్తామన్న కేటీఆర్

సూర్య అసెంబ్లీ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై సమగ్రమైన చర్చ జరిగేందుకు వీలుగా శాసనసభ సమావేశాలను కనీసం నెల రోజుల పాటు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏదో తూతూమంత్రంగా రెండు మూడు రోజులు సభను నిర్వహించి చేతులు దులుపుకునే ధోరణిని ప్రతిపక్షంగా తాము ఎంతమాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో ఎన్నో కీలకమైన ప్రజా సమస్యలు పేరుకుపోయాయని, వాటన్నింటిపై విస్తృతంగా చర్చించి పరిష్కారాలు కనుగొనే విధంగా గౌరవ శాసనసభ స్పీకర్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రమైన అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా ఏడు డీఏలు పెండింగ్‌లో పెట్టడంతో ఉద్యోగ సంఘాలు రోడ్లపైకి వచ్చి ఉద్యమ బాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. సర్వీసు ముగించుకుని విశ్రాంతి జీవితం గడుపుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు నెలల తరబడి రావాల్సిన బెనిఫిట్స్ అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, వారందరి తరఫున సభలో గట్టిగా గొంతు విప్పుతామని తేల్చిచెప్పారు. 

ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వ వైఖరిని అసెంబ్లీ వేదికగా తీవ్రంగా ఎండగడతామని పేర్కొన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల్లో 22ఏ నిషేధిత భూముల పేరిట పెద్ద ఎత్తున అక్రమాలు మరియు అవినీతి దందా జరుగుతోందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ 22ఏ భూముల వ్యవహారంలో జరుగుతున్న భారీ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని హెచ్చరించారు. రైతాంగ సమస్యలు, రుణమాఫీ వైఫల్యాలు, గురుకులాల దుస్థితితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీపై సభలో నిలదీసి ప్రభుత్వాన్ని ప్రజల ముందు బోనులో నిలబెడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.