BREAKING
కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేస్తాం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లలిత కళాపరిషత్ లో డిప్యూటీ మేయర్ టి. స్వాతికి ఘనసత్కారం.. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : రాయపూడి ని పరామర్శించిన మండలి వెంకట్రామ్ అనంతలో సండేస్ ఆన్ సైకిల్ 100వ ఎడిషన్.. భారీగా పాల్గొన్న విద్యార్థులు క్రీడాకారులు భక్తులకు వాటర్ బాటిళ్ల పంపిణీ.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి మనవరాలి పట్టుబట్టడంతో థియేటర్లో రామాయణం చూసిన అమిత్ షా.. సినిమాపై ప్రశంసల వర్షం రెండో విడతలోనూ టీడీపీ హవా! పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి.. ఘనంగా సూఫీ అభిషిక్తులు.. పుస్తక పఠనం విజ్ఞానానికి ఎంతో మేలు యూనివర్సిటీ వేదికపై అసభ్య ప్రవర్తన.. ప్రముఖ యూట్యూబర్ భువన్ బామ్‌పై కేసు నమోదు

చలో ఢిల్లీ.. 34వ ఐఎన్‌టీయూసీ ప్లీనరీని విజయవంతం చేయండి

Select Suryaa Now
చలో ఢిల్లీ.. 34వ ఐఎన్‌టీయూసీ ప్లీనరీని విజయవంతం చేయండి

పటాన్‌చెరు;కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం,ఉద్యోగ భద్రతే ప్రధాన అజెండాగా ఢిల్లీలో నిర్వహించనున్న ఐఎన్‌టీయూసీ 34వ జాతీయ ప్లీనరీ సమావేశాలకు సంగారెడ్డి జిల్లా నుంచి కార్మిక నాయకులు, ప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివెళ్లనున్నారు. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో జరగనున్న ఈ సమావేశాలను విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు, పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కురి నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.శనివారం పటాన్‌చెరు పారిశ్రామికవాడలోని ఏషియన్ పెయింట్స్ పరిశ్రమ వద్ద చలో ఢిల్లీ 34వ ప్లీనరీ సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ అఖిల భారత ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు డాక్టర్ జి. సంజీవరెడ్డి నాయకత్వంలో ఢిల్లీలో జరిగే జాతీయ ప్లీనరీకి దేశవ్యాప్తంగా కార్మిక ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా నుంచి సుమారు 100 మందితో సమావేశాలకు తరలివెళ్లనున్నట్లు వెల్లడించారు.దేశంలో మూడున్నర కోట్ల మంది సభ్యత్వం కలిగిన కార్మిక సంఘంగా ఐఎన్‌టీయూసీ ఉందని పేర్కొన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, రైతుల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో తమ గళాన్ని వినిపించనున్నట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన కార్మిక చట్టాలపై తమ వ్యతిరేకతను ప్లీనరీ వేదికగా తెలియజేస్తామని చెప్పారు.కార్మికుల సమస్యలు, హక్కులు,సంక్షేమానికి సంబంధించి ప్లీనరీలో చర్చించి తీసుకునే నిర్ణయాలు, ఆమోదించే తీర్మానాలకు సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లీనరీని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు మారగారి శ్రీనివాస్, కరుణాకర్ రెడ్డి, బాలకృష్ణ,అమర్ సింహారెడ్డి, సుబ్బయ్య,జాకబ్,రాజు, వేణుగౌడ్,భోజరాజు, మహేందర్,నర్సింహారెడ్డి, డి. లక్ష్మీనారాయణ, సూర్యనారాయణ,మల్లికార్జున తదితరులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.