అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
రెండు ట్రాక్టర్లు సీజ్.. ఇద్దరిపై కేసులు
రాజపేట: అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాజపేట ఎస్‌ఐ తకీయుద్దీన్ హెచ్చరించారు.శనివారం చల్లూరు గ్రామంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్న అదే గ్రామానికి చెందిన గుంటి కరుణాకర్, పల్లెపాటి పట్టుకున్నారు. రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి, వారిపై కేసులు నమోదు చేశారు.ఇసుక రవాణా చేసేవారు ప్రతి బుధవారం అవసరమైన పత్రాలతో తహసీల్దార్ నుంచి అనుమతి పొందాలని ఎస్‌ఐ సూచించారు. అనుమతి పత్రంలో పేర్కొన్న ట్రాక్టర్, డ్రైవర్‌తో నిర్దేశించిన వాగు నుంచే ఇసుక తరలించాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.