BREAKING
48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ ఎస్సై బి జగన్మోహన్ రావును అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్ మండపేట మున్సిపల్ ఎన్నికల్లో తొలిరోజు నామినేషన్లు నిల్ ఎథనాల్ ఉత్పత్తికి చెరకు మళ్లింపుపై కేంద్రం కీలక నిర్ణయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం

సింగరేణిలో రూ.3 వేల కోట్ల బొగ్గు స్కామ్‌.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

Select Suryaa Now
సింగరేణిలో రూ.3 వేల కోట్ల బొగ్గు స్కామ్‌.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

సూర్య ప్రతినిధి, హైదరాబాద్ :తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన బహిరంగ లేఖ రాశారు. విదేశీ బొగ్గు దిగుమతి పేరుతో సింగరేణి సంస్థలో ఏకంగా రూ.3,000 కోట్ల మేర భారీ కుంభకోణానికి తెరలేపారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. కృత్రిమంగా బొగ్గు కొరతను, విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించి.. 'భోత్రా లాజిస్టిక్స్' అనే సంస్థతో ప్రభుత్వం రహస్య ఒప్పందం చేసుకుందని కేటీఆర్ మండిపడ్డారు.

ఈ లేఖలో కేటీఆర్ లేవనెత్తిన ప్రధానాంశాలు:

 * రహస్య ఒప్పందాలు బయటపెట్టాలి: విదేశీ బొగ్గు దిగుమతి కోసం చేసుకున్న ఒప్పందాలన్నింటినీ ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేయాలని, భోత్రా లాజిస్టిక్స్ సంస్థను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 * స్వతంత్ర విచారణ కావాలి: విదేశీ బొగ్గు కొనుగోళ్లు, ఒప్పందాలపై నిష్పాక్షికంగా ఒక స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

 * సింగరేణికి బకాయిలు చెల్లించాలి: రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.60,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు.

 * దేశీయ సంస్థలకు అన్యాయం: విదేశీ బొగ్గు దిగుమతుల కోసం మన దేశీయ సంస్థల ప్రయోజనాలను, సింగరేణి ఉనికిని పూర్తిగా పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 * కాంగ్రెస్ - బీజేపీ కుట్రలు: తెలంగాణ ఇంధన రంగాన్ని, సింగరేణిని దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న కుట్రలను చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్ హెచ్చరించారు.