సెర్ప్ ఆఫీసులో రూ.2 లక్షల విలువైన సామాగ్రి చోరీ
సూర్య చింతలమానేపల్లి :
మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి సమయంలో చోరీకి పాల్పడ్డారు.కార్యాలయంలోని ఆఫీస్ సామగ్రి, ఎల్‌ఈడీ, ప్రింటర్, బ్యాటరీ, కెమెరా సీసీటీవీ తదితర సామగ్రి చోరీకి గురైనట్లు అధికారులు తెలిపారు. సుమారు రూ.2 లక్షల విలువైన సామాగ్రి అపహరణకు గురైనట్లు పేర్కొన్నారు.విషయం తెలుసుకున్న కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కార్యాలయంలోని సామగ్రి చోరీకి గురైన విషయాన్ని గుర్తించి, ఘటనపై విచారణ చేపట్టారు.కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ చోరీ జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు కూడా కార్యాలయంలోని రికార్డులు, సామగ్రిని పరిశీలించారు.