కురుమ యువ చైతన్య సమితి నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా మందుల అంజయ్య
కురుమ యువ చైతన్య సమితి నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా మందుల అంజయ్య
మునుగోడు: కురుమ యువ చైతన్య సమితి నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన గ్రామ ఉపసర్పంచ్ మందుల అంజయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన కురుమ యువ చైతన్య సమితి నల్గొండ జిల్లా కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడిగా మందుల అంజయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మందుల అంజయ్య మాట్లాడుతూ కురుమ యువ చైతన్య సమితిని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. యువతను సంఘటితం చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, కురుమ సమాజ అభ్యున్నతి కోసం నాయకులు, యువతతో కలిసి పనిచేస్తానని తెలిపారు.తనను జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడంలో సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సమితి అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని అంజయ్య పేర్కొన్నారు. ఆయన ఎన్నిక పట్ల పలువురు నాయకులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.