అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న సిద్ధి గణపతి
అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న సిద్ధి గణపతి
పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి ఆలయంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు సిద్ధి గణపతి అన్నపూర్ణేశ్వరుడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఉదయం పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ, హోమం తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి సిద్ధి గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారిని దర్శించుకున్న మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి
పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రుద్రారం గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎనిమిదవ రోజు అన్నపూర్ణేశ్వరుడి అలంకరణలో దర్శనమిస్తున్న సిద్ధి గణపతిని సుధీర్ రెడ్డి దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈకార్యక్రమంలో ఈఓ లావణ్య, జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పట్లోళ్ల లక్ష్మారెడ్డి, సాయి గణేష్, సతీష్ కుమార్, మురళి గౌడ్, సంతోష్, ప్రభు, శివరాములు, రాజేష్, ముకుంద రెడ్డి, నారాయణరెడ్డి, మహేష్, కృష్ణ, శ్రీనివాస్, రత్న తదితర కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.