telanagana
రాజంపేటలో మూడు ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు..
సూర్య రాజంపేట : రాజంపేట మండల కేంద్రంలో మూడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో భాగంగా ముగ్గు పోసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పటేల్ సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఇమ్రాన్ అలీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి, దొబ్బల దుర్గం, కొప్పుల నరేష్, జమీల్, దొబ్బల ప్రవీణ్, పంధుల స్వామి, పుట్ట గణేష్, బోయిని రమేష్, రహమత్, దొబ్బల భీమయ్య తదితరులు పాల్గొన్నారు.