BREAKING
ఎథనాల్ ఉత్పత్తికి చెరకు మళ్లింపుపై కేంద్రం కీలక నిర్ణయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం అయ్యప్ప స్వామి నూతన పీఠం ప్రారంభోత్సవం అమెరికాలో డేటా సెంటర్లకు ఊరట

పువ్వుల సాగుతో రైతుల జీవితాల్లో ఆర్థికభివృద్ధి

Select Suryaa Now
పువ్వుల సాగుతో రైతుల జీవితాల్లో ఆర్థికభివృద్ధి

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి జిల్లాలో ఉద్యాన పంటల సాగుతో రైతులు ఆర్థికంగా బలపడాలని, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించేందుకు పువ్వుల సాగు ఎంతో లాభదాయకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. గురువారం మావల మండలం బట్టిసావర్గం శివారులో రైతు బొమ్మల స్వామి కి చెందిన పువ్వుల తోటను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం తలమడుగు మండలం కజ్జర్ల గ్రామ శివారులో కొప్పుల కిరణ్ లకు చెందిన పువ్వుల తోట, టమాటా పంటలను బైక్ పై ప్రయాణించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పంట కల్టివేషన్ తీరును తిలకించి, రైతులను అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముందస్తు ప్రణాళికతో చేపట్టిన ఈ పువ్వుల సాగు అభినందనీయమన్నారు. ఈ ఎల్నీనో సమయంలో పంట మార్పిడి విధానంపై జూన్, జులై మాసాల్లో గ్రామసభల్లో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించామని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ తోటలో ఎటువంటి పంట నష్టాలు లేకుండా మంచి దిగుబడి రావడమే కాకుండా, అయోధ్య నుంచి వచ్చిన ప్రత్యేక ఆర్డర్ల మేరకు అక్కడికి ఫార్వర్డ్ లింకేజీ ద్వారా పువ్వులు ఎగుమతి అవుతుండటం విశేషమన్నారు. ఒక ఎకరంలో పువ్వుల సాగుకు కేవలం  35 నుంచి 40 వేల వరకు మాత్రమే ఖర్చు అవుతుందని, మార్కెట్లో విక్రయిస్తే దాదాపు 5 టన్నుల వరకు దిగుబడి వచ్చి రూ. 2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. తక్కువ నీటి వినియోగం కోసం స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కూడా కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత అక్టోబర్ ఎండల తీవ్రత దృష్ట్యా, సోయాబీన్ హార్వెస్ట్ పూర్తయిన తర్వాత రైతులు వేరుశనగ, మినుము, నువ్వులు వంటి తక్కువ నీరు అవసరమయ్యే స్వల్పకాలిక పంటల వైపు మళ్లాలని సూచించారు. పత్తి తీసిన వెంటనే మళ్లీ జొన్న లేదా పత్తి భూమిలో అదే పద్ధతి కొనసాగిస్తే మార్చి, ఏప్రిల్ వరకు ఇబ్బందులు తలెత్తుతాయని, కాబట్టి ప్రత్యామ్నాయ స్వల్పకాలిక పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సందీప్, తలమడుగు తహసిల్దార్ రాజ్ మోహన్, కజ్జెర్ల, బట్టిసావర్గం సర్పంచులు నారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మండల ఉద్యానవన అధికారి క్రాంతి, అధికారులు, రైతులు, గ్రామస్థులు, తదితరులు 
పాల్గొన్నారు.