ప్రజాసేవలో ఎస్సై సృజన్ కుమార్ ది ప్రత్యేక ముద్ర
దేవరుప్పుల, మేజర్ న్యూస్, దేవరుప్పుల పోలీస్ స్టేషన్ నుంచి పాలకుర్తి పోలీస్ స్టేషన్కు బదిలీపై వెళ్తున్న ఎస్ఐ ఊర సృజన్ కుమార్ను మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు చింత ఉపేందర్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కి శాలువా కప్పి, ఫోటో ఫ్రేమ్ను అందజేశారు. ఈ సందర్భంగా చింత ఉపేందర్ మాట్లాడుతూ.. దేవరుప్పుల పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్ఐ సృజన్ కుమార్ సమర్థవంతంగా విధులు నిర్వహించారని కొనియాడారు. ముఖ్యంగా యువతకు మార్గదర్శకంగా నిలుస్తూ, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించారని పేర్కొన్నారు. ఆయన సేవలు అభినందనీయమని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
రిపోర్టర్, ఎల్లేష్, జనగామ జిల్లా,