ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచిన కాశవారిగూడెం సర్పంచ్ బొల్లం రమేష్ యాదవ్
ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచిన కాశవారిగూడెం సర్పంచ్ బొల్లం రమేష్ యాదవ్
????మానవతా దృక్పథంతో రక్తదానం చేసిన సర్పంచ్
మునుగోడు,మేజర్ న్యూస్:
మండలంలోని కాశవారిగూడెం గ్రామ సర్పంచ్ బొల్లం రమేష్ యాదవ్ తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఓ వ్యక్తికి బీ బుదవారం రక్తం అవసరమని తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి స్వయంగా రక్తదానం చేశారు.ప్రజలకు సేవ చేయడం పదవితో మాత్రమే పరిమితం కాదని, అవసరమైన సమయంలో తన వంతు సహాయం అందించడమే నిజమైన మానవతా సేవ అని ఆయన నిరూపించారు.రక్తదానం ఒక వ్యక్తికి రక్తం అందించడమే కాకుండా, ఆ కుటుంబానికి ఆశను, ధైర్యాన్ని అందించిన గొప్ప సేవగా పలువురు అభినందిస్తున్నారు.
అవసరమైన సమయంలో ముందుకొచ్చి రక్తదానం చేయడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలిచిన బొల్లం రమేష్ యాదవ్ సేవా స్ఫూర్తిని పలువురు కొనియాడారు. మానవత్వంతో రక్తదానం చేసిన సర్పంచ్ బొల్లం రమేష్‌కు గ్రామ ప్రజలు, యువత, నాయకులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.