నొప్పులకు ఉపశమనం.. ఆధునిక చికిత్సతో భరోసా!
చౌటుప్పల్లో 17 ఏళ్లుగా ఫిజియోథెరపీ సేవలు.. నూతన పరికరం ప్రారంభం
చౌటుప్పల్, మేజర్ న్యూస్:పట్టణ కేంద్రంలో గత 17 సంవత్సరాలుగా ఫిజియోథెరపిస్ట్ డా. గుండెబోయిన రమేష్ యాదవ్ అత్యాధునిక పరికరాలతో వైద్యసేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం మరో అత్యాధునిక పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పురోహితులు మారేపల్లి రామానుజాచార్యుల చేతుల మీదుగా డా. గుండెబోయిన రమేష్, రజిత పూజలు నిర్వహించి పరికరాన్ని ప్రారంభించారు.
వెన్నునొప్పి, మెడనొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల సమస్యలు, శరీర కదలికల్లో ఇబ్బందులు వంటి సమస్యలతో బాధపడేవారికి ఫిజియోథెరపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి తగిన చికిత్స, వ్యాయామాల ద్వారా నొప్పుల నిర్వహణకు, శరీర కదలికల మెరుగుదలకు సహాయపడుతుంది.
*17 ఏళ్లుగా సేవలు*
చౌటుప్పల్ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ 17 ఏళ్లుగా ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్న డా. గుండెబోయిన రమేష్ యాదవ్.. ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తూ సేవలను విస్తరిస్తున్నారు. తాజా పరికరంతో రోగులకు మరింత మెరుగైన ఫిజియోథెరపీ సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.