BREAKING
తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు రోజంతా సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో జరిగే అనర్థాలు ఇవే.. డీహైడ్రేషన్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఓట్ల తొలగింపుపై ప్రశ్నిస్తే అరెస్ట్లు చేయడం సరికాదు: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు

Select Suryaa Now
ఓట్ల తొలగింపుపై ప్రశ్నిస్తే అరెస్ట్లు చేయడం సరికాదు: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు

ఓట్ల తొలగింపుపై ప్రశ్నిస్తే అరెస్ట్లు చేయడం సరికాదు: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు.

మునుగోడు: ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాథమిక హక్కైన ఓటు పరిరక్షణ కోసం ప్రశ్నిస్తూ ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ ఆగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గార్లను ఈ విధంగా అరెస్టులు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సైదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల అరెస్టును ఖండిస్తూ ఎఐసిసి పిలుపు మేరకు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మునుగోడు మండల కేంద్రంలోని చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ పేరిట గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది అర్హులైన ఓట్లను అక్రమంగా తొలగించడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేసినట్లేనన్నారు.కేంద్ర ఎన్నికల సంఘం  స్వతంత్రంగా వ్యవహరించకుండా, అధికార పక్ష కనుసన్నల్లో పనిచేస్తోందని విమర్శించారు. ఓట్ల చోరీకి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జాజుల అంజయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బూడిద లింగయ్య యాదవ్, చండూరు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యులు  ఎండి అన్వర్, కాంగ్రెస్ మండల నాయకులు జక్కల శ్రీనివాస్, పంతంగి స్వామి, మందుల బీరప్ప, ఆరేళ్ల సైదులు, పాలకూరి మహేష్, ఆవుల శ్రీను, వివిధ గ్రామాల సర్పంచులు కంభంపాటి జ్యోతి వెంకటేశ్వర్లు, దాసరి గోవర్ధన్, కదిరే లింగయ్య, వరికుప్పల భువనేశ్వరి విజయ్, కొంపెల్లి ఉపసర్పంచ్ వెదిరే విజయేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బెల్లి పూర్ణ యాదవ్, నాయకులు నన్నూరి సత్తిరెడ్డి, నక్క వెంకన్న, కట్ట రాజు, డాక్టర్ సంకు శంకర్ , బోయ సతీష్, దర్శనం పవన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.