నీట్ పరీక్షల్లో మెడికల్ సీట్ సాధించిన హర్షిత రాథోడ్
*నీట్ పరీక్షలో మెడికల్ సీట్ సాధించిన హర్షిత రాథోడ్*
*అభినందించిన వికాస్ పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్*
తొర్రూర్
సెప్టెంబర్ 23 మేజర్ న్యూస్ (సూర్య) నీట్
స్థానిక డివిజన్ కేంద్రంలో వికాస్ పాఠశాల పూర్వ విద్యార్థిని హర్షిత్ రాథోడ్, నీట్ పరీక్షలో మెడికల్ సీట్ సాధించడంతో
పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ క్యాష్ అవార్డుతో పాటు మూమెంటో, శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. బుధవారం ఈ సందర్భంగా
పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ మాట్లాడుతూ వికాస్ పాఠశాల పూర్వ విద్యార్థులు మెడిసిన్, ఐఐటి లలో అనేకమంది సీట్లు సాధించారని, మిగతా విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకోవాలని అలాగే తల్లిదండ్రుల ఆశయాలకు, ఆశలకు అనుగుణంగా విద్యార్థులు నడుచుకుంటే చక్కని క్రమశిక్షణతో, పట్టుదలతో చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్స్ వేణుమాధవ్, నాగరాజు, వైస్ ప్రిన్సిపల్స్ రాజు లింగమూర్తి విద్యార్థిని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.