BREAKING
గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం: డబుల్ డెక్కర్ బస్సులో చెలరేగిన భారీ మంటలు.. 9 మంది సజీవదహనం ఒడిశాలో రూ. 2.45 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు అధికారుల పర్యవేక్షణలో గణనాథుల నిమజ్జనం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఆయుష్మాన్ భారత్ పిఎమ్-జెఎవై నీట్ పరీక్షల్లో మెడికల్ సీట్ సాధించిన హర్షిత రాథోడ్ ఆధ్యాత్మిక మేల్కొలుపుతోనే దేశాభివృద్ధి సాధ్యం అధికారులకే ఎదురుతిరిగిన లైన్‌మెన్…! ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం వాషింగ్టన్‌లో షీ జిన్‌పింగ్‌కు ట్రంప్ ఘన స్వాగతం: వాణిజ్య సంధిని పొడిగించేందుకు అమెరికా-చైనా అంగీకారం కెమెరా లేని కొత్త స్మార్ట్ గ్లాసెస్ ఆవిష్కరించనున్న మెటా ఎఫ్‌బీఐ డేటా సైబర్ హ్యాకింగ్ వెస్ట్ బ్యాంక్ ఆంక్షల విషయంలో బ్రిటన్‌పై అమెరికా అసంతృప్తి చైనా ఈ-కామర్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ధాటి కళింగపట్నం సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం ఆస్ట్రేలియా మెడికేర్ వ్యవస్థలో ఓపెన్ ఏఐ కలకలం

జగన్ కుటుంబానికి హరీష్ రెడ్డి భరోసా

Select Suryaa Now
జగన్ కుటుంబానికి హరీష్ రెడ్డి భరోసా

 

పిల్లల చదువుల కోసం రూ.2 లక్షల ఆర్థిక సాయం

సూర్య ఎండపల్లి :

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్‌ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి పరామర్శించారు. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి, జగన్‌ పిల్లల చదువుల కోసం తన తరఫున 1 లక్ష, అమెరికాలోని తన తోటి ఎన్నారై బీఆర్‌ఎస్‌ మిత్రుల తరఫున మరో 1.లక్ష, మొత్తంగా రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని బుధవారం అందించారు.
జగన్‌ పిల్లల భవిష్యత్‌కు అండగా నిలవాలనే ఉద్దేశంతో అందించిన ఈ మొత్తాన్ని వారి చదువుల కోసం వినియోగించాలని కుటుంబ సభ్యులకు హరీష్ రెడ్డి సూచించారు. కష్టకాలంలో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు పిల్లల చదువులకు చేయూతనందించిన హరీష్ రెడ్డికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ, ఎండపల్లి మండల స్థాయి నాయకులు జగన్‌ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు కూడా హాజరై జగన్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు.