BREAKING
గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం: డబుల్ డెక్కర్ బస్సులో చెలరేగిన భారీ మంటలు.. 9 మంది సజీవదహనం ఒడిశాలో రూ. 2.45 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు అధికారుల పర్యవేక్షణలో గణనాథుల నిమజ్జనం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఆయుష్మాన్ భారత్ పిఎమ్-జెఎవై నీట్ పరీక్షల్లో మెడికల్ సీట్ సాధించిన హర్షిత రాథోడ్ ఆధ్యాత్మిక మేల్కొలుపుతోనే దేశాభివృద్ధి సాధ్యం అధికారులకే ఎదురుతిరిగిన లైన్‌మెన్…! ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం వాషింగ్టన్‌లో షీ జిన్‌పింగ్‌కు ట్రంప్ ఘన స్వాగతం: వాణిజ్య సంధిని పొడిగించేందుకు అమెరికా-చైనా అంగీకారం కెమెరా లేని కొత్త స్మార్ట్ గ్లాసెస్ ఆవిష్కరించనున్న మెటా ఎఫ్‌బీఐ డేటా సైబర్ హ్యాకింగ్ వెస్ట్ బ్యాంక్ ఆంక్షల విషయంలో బ్రిటన్‌పై అమెరికా అసంతృప్తి చైనా ఈ-కామర్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ధాటి కళింగపట్నం సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం ఆస్ట్రేలియా మెడికేర్ వ్యవస్థలో ఓపెన్ ఏఐ కలకలం

ప్రభుత్వ షట్టర్లపై అద్దెదారుల పేచీ.. బహిరంగ వేలంతో అసలు బాగోతం బట్టబయలు..!

Select Suryaa Now
ప్రభుత్వ షట్టర్లపై అద్దెదారుల పేచీ.. బహిరంగ వేలంతో అసలు బాగోతం బట్టబయలు..!

 

*30 ఏళ్లుగా అద్దెకు ఉంటూ.. సొంత ఆస్తులుగా చూపించే యత్నమా..?

*యదావిధిగా వేలం వేస్తాం: కమిషనర్ జి. వెంకట గోపాల్

శామీర్‌పేట,మేజర్ న్యూస్:మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని  ఉద్దెమర్రి గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన షట్టర్ల బహిరంగ వేలం వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ దుకాణ సముదాయాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేసి వేలం నిర్వహణకు చర్యలు చేపట్టగా, కొందరు అద్దెదారులు షట్టర్లు తమకే చెందుతాయంటూ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.దశాబ్దాలుగా ప్రభుత్వ షట్టర్లలో అద్దెకు కొనసాగుతూ, మున్సిపాలిటీకి అద్దె చెల్లిస్తున్న వారు ఇప్పుడు వాటిపై హక్కులు తమకే ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బహిరంగ వేలం ప్రక్రియను అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్తులపై ఎవరైనా అక్రమంగా హక్కులు కల్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే అంశంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా షట్టర్లను వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

*యథావిధిగా బహిరంగ వేలం:కమిషనర్ జి.వెంకట గోపాల్

ఉద్దెమర్రి వార్డు కార్యాలయంతో పాటు మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని ఇతర వార్డు కార్యాలయాల పరిధిలో ఉన్న షట్టర్లను యథావిధిగా బహిరంగ వేలం వేస్తామని మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ తెలిపారు. వేలం నిలిపివేయాలంటూ తమకు ఎలాంటి కోర్టు ఉత్తర్వులు అందలేదని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్నవారు దుకాణాల కోసం డీడీలు చెల్లించవచ్చని తెలిపారు.