బీజేపీ కార్మిక విభాగం మండల కన్వీనర్‌గా రమేష్
మేజర్ న్యూస్, చౌటుప్పల్ :జేపీ కార్మిక విభాగం చౌటుప్పల్ మండల కన్వీనర్‌గా రెడ్డిబావి గ్రామానికి చెందిన నందగిరి రమేష్ గౌడ్ నియమితులయ్యారు. రాష్ట్ర కన్వీనర్ అందె శ్రీనివాస్ ఆదేశాల మేరకు జిల్లా కన్వీనర్ ఐతరాజు సిద్దు ఈ నియామకాన్ని చేపట్టారు. మునుగోడు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి గంగిడి మనోహర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి అనుమతితో జిల్లా కో-కన్వీనర్ మాధగోని నరేందర్ గౌడ్ నియామక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా నందగిరి రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, బీజేపీ కార్మిక విభాగం బలోపేతానికి శ్రమిస్తానని పేర్కొన్నారు.