BREAKING
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం మంత్రి సుభాష్ జాతీయ స్థాయి క్రీడాకారుడికి ఆర్థిక సాయం ఆసియా క్రీడల్లో గుల్వీర్ సింగ్ హ్యాట్రిక్ రికార్డు 20 ఏళ్ల సమస్యకు మూడు నెలల్లో పరిష్కారం ఆసియా క్రీడల్లో భారత్‌కు కాంస్య పతకం,మిక్స్‌డ్ రిలేలో సరికొత్త జాతీయ రికార్డు నమోదు విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు - ఏఎంసీ చైర్మన్ ఆరికట్ల 23వ అహుడ అథారిటీ సమావేశం రెవెన్యూ సిబ్బంది పనితీరుపై చర్యలు తీసుకోవాలని ఆర్డిఓ కు ఫిర్యాదు కృష్ణపట్నం లో వైద్య శిబిరం న్యాయ విద్యతో రాజ్యాంగ విలువల పరిరక్షణ లా విద్యార్థులతో ఎంపీ అంబికా పల్లె పండుగకు పామూరు నుంచి భారీగా తరలిన కూటమి శ్రేణులు ఏపీ మోడల్ స్కూల్‌లో ఘనంగా ఎస్ఎంసీ ఎన్నికలు. చైల్డ్ కేర్ హోమ్స్ సిబ్బందికి శిక్షణ మల్కంబ్‌లో సత్తా చాటిన విద్యార్థులు గ్లోబల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాక్ దన్

హృదయ ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన

Select Suryaa Now
హృదయ ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన

హృదయ ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన

*భద్రాచలం:* ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో ఎన్ఎస్ఎస్, భాగ్య సెల్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హృదయ ఆరోగ్యం, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాచలం జిల్లా DMHO డాక్టర్ తుకారం రాథోడ్ పాల్గొని విద్యార్థులకు గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ తుకారం రాథోడ్ మాట్లాడుతూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం వంటి అంశాలను వివరించారు. గుండె సంబంధిత వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే. జాన్ మిల్టన్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇవి గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో అదనపు DMHO డాక్టర్ సైదులు, భద్రాచలం లెప్రసీ డాక్టర్ మోహన్, అకడమిక్ కోఆర్డినేటర్ హిమజ, NSS POలు డాక్టర్ ఎం. కిరణ్ కుమార్, సుధాకర్ రావు, భాగ్య సెల్ కన్వీనర్ డాక్టర్ నాగ సమీరా, ఇతర అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.