గ్లోబల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాక్ దన్
అమలాపురం మేజర్ న్యూస్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అమలాపురంలో కోనసీమ సూర్య గ్లోబల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం 2 కిలోమీటర్ల వాక్‌థాన్ నిర్వహించారు.
గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై చైతన్యం తీసుకురావడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
మంగళవారం ఉదయం 7 గంటలకు అమలాపురం ఎస్ కె బి ఆర్ కాలేజీ నుంచి ప్రారంభమైన వాక్ థాన్ స్థానిక గడియారం స్తంభం సెంటర్ వరకు కొనసాగింది.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ సినీ నటి మెహ్రెయిన్ కౌర్, మిస్ ఇండియా సృజనాదేవి విచ్చేసి అందరినీ అలరించారు. కార్యక్రమంలోపార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి ఎమ్మెల్యే ఆనందరావు పాటు అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, సూర్య గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, మహిళలు, యువతతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గుండె సంబంధిత సమస్యలపై అవగాహన పెంచుకోవడం, ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు అడుగు వేయడం మనందరి బాధ్యత” అని నిర్వాహకులు పిలుపునిచ్చారు
వరల్డ్ హార్ట్ డే . సందర్బంగా
సూర్య గ్లోబల్ లో అవేర్నెస్ ప్రోగ్రాం వరల్డ్ హార్ట్ డే . సందర్బంగా
సూర్య గ్లోబల్ హాస్పిటల్ నిర్వహించిన అవేర్నెస్ ప్రోగ్రాంలో మిస్ ఇండియా సృజనా దేవి నిసత్కరించారు ఈకార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ఈ కార్యక్రమానికి అమ్ముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు చాంబర్ అధ్యక్షులు బోణంసత్య వరప్రసాద్. జనసేన నాయకురాలు.నాగమానస .ఆవుపాటి గోపాల్ పాల్గొన్నారు