23వ అహుడ అథారిటీ సమావేశం
అనంతపురం బ్యూరో
23వ అహుడ అథారిటీ సమావేశం
లేఔట్లలో ఈ-వేలానికి ఆమోదం.. పలు అభివృద్ధి పనులకు గ్రీన్‌సిగ్నల్
అనంతపురం: అనంతపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (అహుడ) 23వ అథారిటీ సమావేశం చైర్మన్ టి.సి. వరుణ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో నాలుగు ప్రధాన అంశాలపై చర్చించిన అథారిటీ, అనంతపురం పరిధిలోని లేఔట్లలో ఈ-వేలం నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసింది.
కార్యక్రమంలో అహుడ కార్యదర్శి, ప్లానింగ్ ఆఫీసర్ ఇషాక్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.