గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అభినందనీయం
గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయం
సర్పంచ్ బైరు కొండల్ రెడ్డి
జైత్వారంలో ఉచిత వైద్య శిభిరం
జైత్వారం, మేజర్ న్యూస్: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని జైత్వారం గ్రామ సర్పంచ్ బైరు కొండల్ రెడ్డి అన్నారు. టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ బైరు జగన్ మోహన్ రెడ్డి చొరవతో, సర్పంచ్ బైరు కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో యశోద ఆసుపత్రి (మలక్పేట) వైద్య బృందం జైత్వారం గ్రామ పంచాయతీ వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది.
ఈ శిబిరంలో సుమారు 150 మంది పిల్లలు, యువత, పెద్దలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ జయశ్రీ, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రతిభతో పాటు వైద్య సిబ్బంది పాల్గొని రక్తపోటు, షుగర్, కంటి పరీక్షలు, ఆర్థోపెడిక్ పరీక్షలు, ఈసీజీ, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బైరు కొండల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఇలాంటి వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నవీన్ కుమార్, వార్డు సభ్యులు ఓ. సత్యనారాయణ, కే. మధుకర్, ఎం. రేవంత్, కే. రాజశేఖర్, ఎల్. నవీన్, మమతా మహేందర్, ఎస్. లక్ష్మి అంజయ్య, మేరీ ప్రతాప్ రెడ్డి, జె. విజయలక్ష్మి కృష్ణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటయ్య, గ్రామ పెద్దలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
టి. శ్రీనివాస్ :మేజర్ న్యూస్, కందుకూరు