BREAKING
వ్యవసాయానికి 18 గంటల నిరంతర విద్యుత్ యూరియా అందించాలి గ్లోబల్ వార్మింగ్‌ను నివారించే కీలక మార్గాన్ని విస్మరిస్తున్న ప్రపంచ దేశాలు వైసీపీ నాయకులకు పార్టీ ఐడీ కార్డులు పంపిణీ తగ్గిన బ్లూ ఔల్ రెడంప్షన్ ఒత్తిడి, టెక్ రంగంలో కొనసాగుతున్న రిస్క్ గన్నవరం సీహెచ్‌సీ రూపురేఖలు నెల రోజుల్లో మార్చాలి. సీహెచ్‌సీ అభివృద్ధికి సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలి. సీమకు రఫ్ఫా రఫ్ఫా రాజకీయం కాదు.. అభివృద్ధి సంక్షేమం కావాలి. సీఎం. కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జెఫ్ గుస్తావ్‌సన్ నియామకం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు . గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం : డీ.ఆర్.వో. చైర్‌పర్సన్‌ పావని జన్మదిన వేడుకలు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి లలితమ్మ కన్నుమూత! విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ ఎమ్మెల్యే అమిలినేని చోరువతో ఎస్ వి జి ఎం డిగ్రీ కళాశాల రహదారి నిర్మాణం పూర్తి. వైద్య రంగంలో 2026 నోబెల్ మెడిసిన్ విజేతలుగా డీసర్‌రోత్, హెగెమాన్, నాజెల్ పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాలి ప్రభుత్వ స్కూళ్లకు 4-స్టార్ రేటింగ్.

*గంజాయి కేసులో 3ఏండ్ల జైలు శిక్ష.. 10వేలు జరిమానా*

Select Suryaa Now
*గంజాయి కేసులో 3ఏండ్ల జైలు శిక్ష.. 10వేలు జరిమానా*

*ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ముగ్గురు యువకులకు గంజాయి అక్రమ రవాణా కేసులో మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది.*

మధిర, సూర్య మేజర్ న్యూస్.

 

గంజాయి అక్రమ రవాణా
కేసులో ముగ్గురు నిందితులకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ  జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. కేసు వివరాలు.... 2024 ఆగస్టు 2న ఒడిశా నుంచి 2.5 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తూ ముగ్గురు వ్యక్తులు మధిరలో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటనపై మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 133/2024గా కేసు నమోదైంది. ఎన్టీపీఎస్ చట్టం-1985లోని సెక్షన్ 8(సి ) రెడ్విత్ 20(బి )(ii)(బి ) కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మధిరకు చెందిన కల్యాణపు వంశీ (20), తమ్మిశెట్టి కిరణ్ (19), రెంటపల్లి మహేష్ ఆనంద్ (20) నిందితులుగా ఉన్నారు. విచారణలో వీరిపై నేరం రుజువు కావడంతో ముగ్గురికీ మూడేళ్ల చొప్పున జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.ఈ కేసుతో సంబంధం ఉన్న ఒడిశా ప్రాంతానికి చెందిన హంతాల్ మధు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తును ఇన్స్పెక్టర్లు దోమల రమేష్, . డి. మధు నిర్వహించగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జమ్ముల శరత్ కుమార్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. కేసులో సమర్థవంతంగా విధులు నిర్వహించిన కోర్టు లైజన్ అధికారి ఎస్ఐ కె. శ్రీకాంత్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ నాగేశ్వరరావు, హోంగార్డు అయాబ్ను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

*మధిర టౌన్ ఇన్స్పెక్టర్ డి రమేష్ విజ్ఞప్తి*

యువత గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలకు బానిసై తమ విలువైన భవిష్యత్తును మరియు జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.
మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం మరియు సమాజంపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని కోరారు.
అదేవిధంగా, మధిర పట్టణ పరిధిలో ఎవరైనా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నా, సరఫరా చేస్తున్నా లేదా వినియోగిస్తున్నా, వారి సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.