ఘనంగా ప్రారంభమైన ఎస్ జి ఎఫ్ మండల స్థాయి పోటీలు..
ప్రారంభమైన ఎస్ జి ఎఫ్ మండల స్థాయి పోటీలు..
లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే
క్రీడలు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం
పటాన్ చెరు ; విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా సహకారం అందిస్తే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు లభిస్తాయని శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మంగళవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పటాన్చెరువు మండల స్థాయి క్రీడోత్సవాలను.. ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పటాన్చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విద్యార్థులకు క్రీడల పై ఆసక్తి పెంపొందించేలా నిరంతరం ఉచిత శిక్షణ, క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయి పోటీలకు సైతం అతిథ్యం అందించబోతున్నట్లు తెలిపారు. మూడు రోజులపాటు జరగనున్న క్రీడోత్సవాలకు సంపూర్ణ సహకారం అందిస్తూ అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు నర్రా బిక్షపతి, కుమార్ గౌడ్, శివారెడ్డి, వెంకటేష్, అశోక్, శంకర్, రాజు, రాజన్ సింగ్, వివిధ పాఠశాల క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.