గాయత్రి విద్యానికేతన్‌లో చిన్నారుల బతుకమ్మ సంబరాలు
సూర్య పెద్దపల్లి ప్రతినిధి
సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పెద్దపల్లిలోని గాయత్రి విద్యానికేతన్‌లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన చిన్నారులు రంగురంగుల బతుకమ్మలతో ఆటపాటల్లో పాల్గొని సందడి చేశారు. దీంతో పాఠశాల ప్రాంగణం పూల సోయగాలతో పండుగ శోభను సంతరించుకుంది.
ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ విశిష్టత, ప్రకృతితో ముడిపడిన మన సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ప్రకృతిని గౌరవించడం, సంప్రదాయాలను భావితరాలకు అందించడం బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్, కరస్పాండెంట్ రజనీ, ఉపాధ్యాయ బృందం పాల్గొని చిన్నారులను ప్రోత్సహించారు.