ఎమ్మెల్సీ ఓటు నమోదుకు పిలుపు
నల్ల. సుమిత రఘుమా రెడ్డి చింతపల్లి ,మేజర్ న్యూస్. నల్లగొండ జిల్లా :- నల్గొండ,ఖమ్మం,వరంగల్,జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం దరఖాస్తు చేసుకోవాలని మల్లారెడ్డిపల్లి సర్పంచ్ నల్ల .సుమిత రఘుమారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.నవంబర్ ఒకటి నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన వారు అప్లై చేసుకోవచ్చని నవంబర్ 6 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకుని దరఖాస్తు ఫారాలను మండల ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇవ్వాలని గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు కూడా మళ్లీ తిరిగి అప్లై చేసుకోవాలని చెప్పారు.ఓటు ఫారం 18 నింపాల్సి ఉంటుందని డిగ్రీ సర్టిఫికెట్,ఓటర్ కార్డు,ఆధార్ కార్డు ఆన్లైన్ చేసిన తర్వాత ఆన్లైన్ పారాలు,జిరాక్స్ లు బిఎల్ఓ కు ఇవ్వవచ్చని అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల. రఘుమారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరుకల. వెంకటయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.