BREAKING
కళ్యాణదుర్గం పురపోరు.. ఇక సమరమే...… చైర్‌పర్సన్‌ పీఠంపై టీడీపీ, వైకాపా గురి బరిలో పల్లవి, దొడగట్ట హర్షిణి అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం.. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీల వ్యూహాలు...… డిసెంబర్ 4న నాగ చైతన్య 'వృషకర్మ' గ్రాండ్ రిలీజ్.. ఇంటెన్స్ లుక్‌తో సరికొత్త పోస్టర్ విడుదల కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ ప్రజా సంక్షేమమే ధ్యేయం.. సరికొత్త రాజకీయ వేదికగా 'పి.ఆర్.కే. పార్టీ' ఆవిర్భావం! భక్తుల కొంగుబంగారం చిట్కుల్ శ్రీ తుల్జా భవాని అమ్మవారు -భక్తుల కోరిన కోరికలు తీర్చే అమ్మవారు -నవరాత్రులలో నిత్య అన్నదానం -భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాం -ఆలయ వ్యవస్థాపకులు కే.జనార్దన్ చారి విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేసిన అమెరికా రిటైల్ విక్రయాలు

దివ్యాంగులకు సహాయ పరికరాల అందజేత

Select Suryaa Now
దివ్యాంగులకు సహాయ పరికరాల అందజేత

రామాయంపేట;దివ్యాంగులు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగి గౌరవప్రదమైన జీవనం సాగించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని మెదక్ ఎంపీ మాధవేని రఘునందన్‌రావు అన్నారు. దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రామాయంపేటలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 367 మంది దివ్యాంగులకు వివిధ రకాల సహాయక పరికరాలు, సంక్షేమ పథకాల లబ్ధిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. దివ్యాంగుల అవసరాలను గుర్తించి, వారికి ఉపయోగపడే సహాయక పరికరాలను అందించడం ద్వారా వారి దైనందిన జీవితాన్ని సులభతరం చేయవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించాలని, వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని అన్నారు. దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  రామాయంపేట మున్సిపాలిటీ అధ్యక్షుడు శీలం అవినాష్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాగి రాముడు వి హెచ్ పిజిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ గుప్తా జిల్లా ఉపాధ్యక్షులు 8వ వార్డు కౌన్సిలర్ శంకర్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బాలరాజ్ దంతపల్లి సర్పంచ్ సర్పంచులు నిజాంపేట్ సర్పంచ్ చల్మేటి నరేందర్ ప్రవీణ్ బచ్చరాజ్ పల్లి సర్పంచ్ శైలజ శ్రీనివాస్ నవత్ రాజు భాను అనంతలక్ష్మి రమణ చందర్ ఎల్లం దయానంద్ రెడ్డి సంగయ్య కన్నయ్య లావణ్య శేఖర్ రంగయ్య చిన్న నాగరాజు వినయ్ శేఖర్ బండి గిరి అనిల్ స్వామి బాబుతోపాటు స్థానిక బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర ప్రజలు పాల్గొన్నారు.