BREAKING
ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను కలిసిన రామగిరి నూతన జడ్పీటీసీ బైనేని శిరీష .. 17 ఎంపీటీసీ స్థానాల్లో ప్రశాంత ఎన్నికలు.. ఫలితాల రోజు వరకు పటిష్ట బందోబస్తు.. ఎస్‌ఐ రవికుమార్‌కు ఎంపీటీసీల అభినందనలు!...ఎన్నికల కోడ్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల నిఘా..... కొడంగల్ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నేడు స్టాక్ మార్కెట్ సంవత్ 2083 ముహూర్త్ ట్రేడింగ్ శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం కర్ణాటకలో ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ: ప్రైవేట్ కళాశాలల ఫీజుల తగ్గింపు 2028 బంగారం ధరలపై ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలు ఈ సంవత్ మార్కెట్లు నేర్పిన 10 ప్రధాన పాఠాలు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన నూతన నూతన ఎంపీటీసీలు.. సుధాకర్, తిమ్మా నాయుడు రాజస్థాన్ బోర్డ్ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటన వైట్‌హౌస్ నూతన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్ ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ని కలసిన జడ్పిటిసి సౌమ్య ఏఐ క్షీణతతో భారత్, చైనా మార్కెట్లకు విదేశీ నిధుల వెల్లువ గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత: హోర్ముజ్ వద్ద పేలుళ్లు, అరామ్‌కోపై దాడులు

చైర్ పర్సన్ పై ఆరోపణలు చేస్తే సహించేది లేదు

Select Suryaa Now
చైర్ పర్సన్ పై ఆరోపణలు చేస్తే సహించేది లేదు

ఇల్లందు సూర్యా ప్రతినిధి :

మున్సిపల్ చైర్ పర్సన్ పై ఆరోపణలు చేస్తే సహించేది లేదు 
- రహదారి పేరుతో పేదలపై చేస్తున్న వేధింపులు తక్షణమే ఆపాలి 
- గతంలో నివేదికల ఆధారంగా అధికారులు విచారణ పకడ్బందీగా నిర్వహించాలి 
- 8 ఏళ్లుగా వివాదంలో ఉన్న రహదారి సమస్యను పరిష్కరించాలి 
- తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు బోశాల దుర్గారావు మాదిగ డిమాండ్ 
ఇల్లందు రూరల్, సూర్య మేజర్ న్యూస్ : ఇల్లందు మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ కుటుంబం పై నిరాహార ఆరోపణ చేస్తే సహించేది లేదని తెలంగాణ ఎంఆర్పిఎస్ నియోజకవర్గ అధ్యక్షులు బో శాల దుర్గారావు మాదిగ హెచ్చరించారు. శుక్రవారం ఈమెకు ఆయన మాట్లాడారు. మండల పరిధిలోని మొండితోగు గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దమ్మతల్లి ప్రాంతంలో రహదారి వివాదాన్ని అడ్డుపెట్టుకొని పేద ప్రజలను, ముస్లిం కుటుంబాలను బండి వెంకటేశ్వర్లు అను వ్యక్తి వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు. ఆ వ్యక్తి నివారణలో గతంలోనే ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్కు నివేదికలు సమర్పించారని సంబంధించిన అధికారిక పత్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో రహదారి కొలతలకు సంబంధించిన లిఖితపూర్వక వివరాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ పత్రాలను పక్కనపెట్టి మళ్ళీ అదే వివాదాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక ఉన్న అంతర్యాన్ని అధికారులు తేల్చాలని డిమాండ్ చేశారు. 2020 లోనే బండి వెంకటేశ్వర్లు చేస్తున్న తప్పుడు ఫిర్యాదులు స్థానిక ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, అధికారుల విధులకు కలుగుతున్న ఆటంకాలు, తదితర అంశాల పట్ల నాటి పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ హెచ్ ఓ, తాసిల్దార్ మేకల మస్తాన్ రావు, ఎంపీడీవో, ఎంపీవో, గ్రామపంచాయతీ కార్యదర్శి ద్వారా నాడు జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించినట్లు తమ వద్ద పత్రాలు ఉన్నాయన్నారు. న్యాయం చేయాల్సిన అధికారులు గతంలో నివేదికలు సమర్పించినప్పటికీ సమస్య మరల పునరావృతం ఎందుకు అవుతుందో విచారించాలన్నారు. స్థానిక ముస్లిం,  దళిత కుటుంబాలు రహదారిని ఆక్రమించి ఇల్లు నిర్మించారంటూ బండి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎస్కే యాకుబ్ పాషా, కొరివి రాణి అమ్మ, ఎస్ కే అలీమా బేగం తదితర ఇళ్లకు సంబంధించిన నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు అన్నారు. ఈ వివాదం గతంలో ముగిసి పోలేదని, 2026 లోను రహదారి నిర్మాణానికి ఆటంకాలు కలుగుతున్నాయని అంశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. నివేదికలో ప్రభుత్వ మంజూరు చేసిన సిసి రోడ్లను నిర్మించకుండా బండి వెంకటేశ్వర్లు అడ్డుకోవడం, విధులకు ఆటంకాలు ఆయన కలిగించడం, ఇంజనీర్, గ్రామపంచాయతీ కార్యదర్శి, సర్పంచులు విధులు నిర్వహించకుండా బెదిరింపులకు పాల్పడడం దళిత అంశాలు నివేదికలో ప్రస్తావించారని గుర్తు చేశారు. రహదారి వెడల్పు పై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సంబంధిత భూమి యజమాని ప్రస్తుత మున్సిపల్ చైర్ పర్సన్ తండ్రి లూయిస్ వసంత్ కుమార్ ను అధికారులు వివరణ 12 ఫీట్ల దారి లేదు 9 సీట్ల దారి మాత్రమే అధికారులకు రాసి ఇవ్వడం జరిగిందన్నారు. అధికారులు అదే అంశంపై వివరణ కోరగా 9 అడుగుల రహదారి మాత్రమే ఉన్నట్లు స్థానిక పంచాయతీ అధికారులు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారన్నారు. పాత నివేదికలు అధికారుల వద్ద ఉన్న మున్సిపల్ చైర్ పర్సన్ మీద నిరాధారణ ఆరోపణలు చేయడాన్ని సహించేది లేదన్నారు. బండి వెంకటేశ్వర్లు కక్షపూరితంగా మున్సిపల్ చైర్ పర్సన్ కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రచారం చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చైర్పర్సన్ కుటుంబానికి సంబంధించిన భూమిలో కొంత భాగం కేటాయించాలని, ఫ్లాట్ ల విక్రయాల ద్వారా డబ్బులు ఇవ్వాలని బండి వెంకటేశ్వర్లు బెదిరించిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, అధికారులు నివేదికలు, గతంలో పత్రాల ఆధారాలను పరిగణలోకి తీసుకొని నిష్పక్షపాతంగా విచారించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చి దోషులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తుంది అన్నారు.

ఇల్లందు సూర్య రూరల్ రిపోర్టర్ డానియల్