BREAKING
తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు రోజంతా సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో జరిగే అనర్థాలు ఇవే.. డీహైడ్రేషన్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బ్యాలెట్ పేపర్లతో జరిగిన త్రిపుర ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ నేతలకు చెంపపెట్టు

Select Suryaa Now
బ్యాలెట్ పేపర్లతో జరిగిన త్రిపుర ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ నేతలకు చెంపపెట్టు

 

యాదగిరిగుట్ట మేజర్ న్యూస్.....

బ్యాలెట్ పేపర్లతో జరిగిన త్రిపుర ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ నేతలకు చెంపపెట్టు: *బీజేపీ నేత రచ్చ శ్రీనివాస్
​ఓడిపోతే ఈవీఎంల వంక.. బ్యాలెట్ పేపర్లలోనూ డిపాజిట్లు గల్లంతు కాంగ్రెస్ డ్రామాలకు ప్రజలే తీర్పు చెప్పారు. ​ఎన్నికల్లో వరుస పరాజయాలు ఎదురవుతుండటంతో కాంగ్రెస్ నేతలు  ఈవీఎంలపై నిందలు వేస్తూ, "ఓట్ల చోరీ" పేరిట దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే డ్రామాలకు తెరతీశారని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు.
​ఈ సందర్భంగా రచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ:
​బ్యాలెట్ పేపర్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఘోర పరాభవం:
కాంగ్రెస్ పదేపదే ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్ విధానం తేవాలని డిమాండ్ చేస్తుంటుంది. ఇటీవలే త్రిపురలో విలేజ్ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగాయి. మరి ఆ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. 4,500లకు పైగా స్థానాల్లో బీజేపీ–ఎన్డీయే కూటమి 4,300లకు పైగా సీట్లు గెలుచుకుని దాదాపు 94% స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తే, కాంగ్రెస్ కేవలం 14 స్థానాలకే పరిమితమై దారుణంగా తుడిచిపెట్టుకుపోయింది. ​ప్రజల తీర్పును గౌరవించడం కాంగ్రెస్‌కు చేతకాదు: ఈవీఎంలతో జరిగినా, బ్యాలెట్ పేపర్లతో జరిగినా ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తున్నారనే దానికి త్రిపుర ఎన్నికలే తిరుగులేని నిదర్శనం. తెలంగాణ, కర్ణాటకల్లో గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్లా? బీజేపీ గెలిస్తే ఓట్ల చోరీయా? కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ​కాంగ్రెస్ నైరాశ్యంతోనే రోడ్లపై నాటకాలు:
దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలకు దేశవ్యాప్తంగా ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రజల ఆదరణ కోల్పోయిన రాహుల్ గాంధీ, రాజ్యాంగబద్ధ వ్యవస్థలైన కేంద్ర ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు చేస్తూ వ్యవస్థలను బలహీనపరిచే కుట్రలు చేస్తున్నారు.
​ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఓటమికి కారణాలు విశ్లేషించుకోకుండా ప్రజాస్వామ్య ప్రక్రియపై, ఓటర్ల విచక్షణపై బురదజల్లుతున్న రాహుల్ గాంధీ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రచ్చ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలతో పబ్బం గడుపుకోవాలని చూస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా మరింత ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు.   రచ్చ శ్రీనివాస్. బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్.