ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
లింగాలఘణపూర్ , మేజర్ న్యూస్, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర కల్పించేందుకే ఐకెపి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు నెల్లుట్ల గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ తెలిపారు. గురువారం నెల్లుట్ల గ్రామంలో వాసవి గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.*ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..* రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. తరుగు లేకుండా ప్రభుత్వ మద్దతు ధర పొందేందుకు గ్రామంలోని ఐకెపి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని, ప్రభుత్వ నిబంధనల మేరకు తేమ శాతం ఉండేలా చూసుకొని కేంద్రానికి తీసుకురావాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్ రాజ్, జిపిఓ ఎండి. జబ్బర్, ఉప సర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, గ్రామశాఖ అధ్యక్షులు మాచర్ల మహేందర్, మాజీ ఎంపీటీసీ మోటే వీరస్వామి, సి.ఎ రేవతి,వార్డు సభ్యులు కొయ్యడ అనిల్, వేల్పుల శోభారాణి, గొరిగే సందీప్, కత్తి శ్రీవాణి, బొజ్జం సునీత ప్రభాకర్, నల్ల అజయ్, నల్ల విల్సన్, బండారి మమత అశోక్, బత్తిని వేణు, కొమ్మరాజుల రేణుక కొమ్మురయ్య, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు నర్సింగ రమేష్, కురుమ సంఘం అధ్యక్షులు కడకంచి ప్రతాప్, నాయకులు కొయ్యడ రామచంద్ర, కుర్రేముల రమేష్, మారబోయిన ఉప్పలయ్య, జెగ్గం ఆనంద్, శివరాత్రి ఐలయ్య, జిగురు ఉపేందర్, వాసవి వివో సభ్యులు, హమాలీ సంఘం నాయకులు, మహిళలు మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: కార్తీక్ ,లింగాల ఘనపూర్, జనగామ జిల్లా