అభివృద్ధి పనులను పర్యవేక్షించిన డీఆర్డీఓ శ్రీనివాస్
బంట్వారం, మేజర్ న్యూస్: బంట్వారం మండల పరిధిలోని మధ్వాపూర్, నాగారం, రొంపల్లి గ్రామాల్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను డీఆర్డీఓ శ్రీనివాస్ గురువారం పర్యవేక్షించారు. ఆయా గ్రామాల్లో చేయూత పింఛన్ల పంపిణీ, జలసిరి పనులు, మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పనుల పురోగతిపై సమీక్షించారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చేయూత పింఛన్ల విషయంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందేలా చూడాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు గోరెమియా, భాగ్యమ్మ, ఎంపీడీవో రాములు, ఎంపీఓ నాగరాజు, ఏపీఓ సుధాకర్, ఏపీఎం ఆనంద్, ఉపాధి హామీ సాంకేతిక సహాయకుడు అశోక్ రెడ్డి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.
రిపోర్టర్: శ్రీనివాస్ గౌడ్, బంటారం, వికారాబాద్ జిల్లా.