BREAKING
త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం* ఎన్నికల సామగ్రి అప్పగించే వరకు పోలింగ్ విధులు కొనసాగాల్సిందే: గుజరాత్ ఎన్నికల సంఘం స్పష్టీకరణ! పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలు: జూన్ ఆటో అమ్మకాల్లో జోరు: టీవీఎస్ సేల్స్ 47 శాతం, బజాజ్ ఆటో 28 శాతం జంప్.. అంచనాలను మించిన వృద్ధి! అమెరికాకు అసాధారణ ప్రతిభావంతులు మాత్రమే కావాలి: నేటి రాశి ఫలాలు: 9 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 9 అక్టోబర్ 2026 శుక్రవారం పిఆర్టియు నారాయణపేట మండల అధ్యక్షులుగా మొల్గాన్ జనార్ధన్ 5 వ వార్డులో తడి పొడి కి చెత్త బుట్టలు పంపిణీ జర్నలిస్టులు నిజాయితీగా వార్తలు రాయాలి.. తప్పుడు కథనాలు రాస్తే శిక్షార్హులు.. పోలీసులు, మీడియా సమన్వయంతో పనిచేయాలి : ఎస్పీ వినీత్ సాకి చెరువు కట్టపై బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సినిమాకు భారీ నష్టం.. ఏకంగా రూ.1,350 కోట్లు గల్లంతు! ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం* కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడం శోచనీయం క్షయ వ్యాధి నిర్మూలించడంలో చిన్న చెల్మెడ గ్రామం

ఆల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు - సంప్రదాయ దుస్తుల్లో అలరించిన విద్యార్థినులు.. - రావణ దహనం చేసిన నరేందర్ రెడ్డి

Select Suryaa Now
ఆల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు - సంప్రదాయ దుస్తుల్లో అలరించిన విద్యార్థినులు.. - రావణ దహనం చేసిన నరేందర్ రెడ్డి
సూర్య మంచిర్యాల: ఆల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశంతో పాఠశాల ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. అనంతరం బతుకమ్మలను చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, పాటలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్బంగా ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో మన సంస్కృతి, పండుగల పట్ల అవగాహనతో పాటు ఐక్యతా భావాన్ని పెంపొందించేందుకు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.