BREAKING
తెలంగాణలో ‘రక్షా ఎక్స్‌పో–2026’ ప్రభాస్ కల్కి సీక్వెల్‌లో బాలీవుడ్ లెజెండరీ నటుడు.. తొలిసారి టాలెంటెడ్ ఎంట్రీ? పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యే బండారు ఒడిశా-ఏపీ సరిహద్దుల్లో తీరం దాటిన తీవ్ర వాయుగుండం: పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు స్థానిక ఎన్నికల్లో సమన్వయంతో పని చేయండి ఎమ్మెల్యే బండారు నంద్యాల జిల్లా టీడీపీ కార్యాలయం కోసం మార్కెట్ యార్డ్ స్థలం ఎకరాకు నెలకు కేవలం రూ.85 ధరకు 99 సంవత్సరాలు లీజు దారుణం- నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటి కన్నుమూత రూ.1.35 లక్షలకు వినాయకుడి లడ్డును సొంతం చేసుకున్న జగదీష్ గౌడ్ దేవరయాంజాల్‌లో ఘనంగా నిమజ్జనం మెడికల్ మాఫియా పై నియంత్రణ లేదా? రోడ్డుపై చేరిన నీరు, నాటు వేస్తూ నిరసన తెలిపిన మహిళలు అనాధల సేవకులు నరసన్న కు మాచాని పరామర్శ అడ్వకేట్ నెరమెట్ల ఎల్లన్నకు ఘన సత్కారం పంతంగిలో జడ్పీ సీఈవో శోభారాణి పర్యటన భారీ వర్షానికి జలమయమైన కనగర్తి పాఠశాల డిపాజిట్లు పై దుమారం

బంగ్లాదేశ్ ముసాయిదా సైబర్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి: అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల డిమాండ్

Select Suryaa Now
బంగ్లాదేశ్ ముసాయిదా సైబర్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి: అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల డిమాండ్

సూర్య అంతర్జాతీయ డెస్క్: బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన ముసాయిదా సైబర్ చట్టం భావప్రకటనా స్వేచ్ఛను తీవ్రంగా హరించేలా ఉందని, దానిని తక్షణమే ఉపసంహరించుకోవాలని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల కూటమి డిమాండ్ చేసింది. సివికస్ ,రాబర్ట్ అండ్ ఎథెల్ కెన్నెడీ హ్యూమన్ రైట్స్ సెంటర్, ఫ్రంట్ లైన్ డిఫెండర్స్, సౌత్ ఏసియన్స్ ఫర్ హ్యూమన్ రైట్స్  తదితర ప్రముఖ హక్కుల సంస్థలు సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ తమ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశాయి. గతంలో విమర్శలు ఎదుర్కొని రద్దయిన వివాదాస్పద డిజిటల్ సెక్యూరిటీ యాక్ట్ (డీఎస్ఏ) తరహాలోని తిరోగామి మరియు నిర్బంధ నిబంధనలను తిరిగి కొత్త చట్టంలో చేర్చారని ఆరోపించాయి.

ముసాయిదా చట్టంలో ఉపయోగించిన 'పుకార్లు', 'తప్పుడు సమాచారం', 'డిజిటల్ పరువు నష్టం', 'అపహాస్యం', 'ఫేక్ న్యూస్' వంటి పదాలకు స్పష్టమైన నిర్వచనాలు లేకపోవడం వల్ల అధికార యంత్రాంగం వీటిని తమకు నచ్చినట్లుగా అన్వయించుకునే ప్రమాదం ఉందని హక్కుల సంఘాలు హెచ్చరించాయి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే జర్నలిస్టులు, పౌర హక్కుల కార్యకర్తలు, విమర్శకులను అణచివేసేందుకు ఈ చట్టాన్ని ఆయుధంగా మలచుకునే ఆస్కారం ఉందని పేర్కొన్నాయి. ప్రతిపాదిత సెక్షన్ల ప్రకారం ఆన్‌లైన్ అంశాలపై పదేళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానాలతో పాటు ముందస్తు బెయిల్ లేని నిర్బంధాన్ని అనుమతించడం తీవ్రమైన పరిణామమని ఆందోళన వ్యక్తం చేశాయి.

ప్రజా సంప్రదింపుల ప్రక్రియను కూడా ప్రభుత్వం నామమాత్రంగానే నిర్వహించిందని, కేవలం ఎంపిక చేసిన కొద్దిమందిని మాత్రమే పిలిచి వాస్తవ భాగస్వాములను విస్మరించిందని సంస్థలు విమర్శించాయి. ప్రజాస్వామ్య సమాజంలో పౌరుల ప్రాథమిక హక్కులు, మీడియా స్వేచ్ఛను కాలరాసే విధంగా ఉన్న ఈ ముసాయిదాను ప్రస్తుత రూపంలో రద్దు చేయాలని పిలుపునిచ్చాయి. అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలు, బంగ్లాదేశ్ రాజ్యాంగ విలువలకు అనుగుణంగా జర్నలిస్టులు, న్యాయ నిపుణులు, సాంకేతిక నిపుణులతో సమగ్ర చర్చలు జరిపిన తర్వాతే సైబర్ భద్రతకు సంబంధించిన సమతుల్య చట్టాన్ని రూపొందించాలని సూచించాయి.