BREAKING
అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలెం వెంకన్న ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం: మాచవరం గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి మైపాల తాతాజీ జోరు నేటి పంచాంగం24 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు24 నవంబర్, 2026 డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -ప్రమాణస్వీకారంలో 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ డివిజన్ అభివృద్ధి నా లక్ష్యం -ప్రమాణస్వీకారంలో 59వ డివిజన్ కార్పొరేటర్ జగదీష్ సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత -ప్రమాణస్వీకారంలో 57వ డివిజన్ కార్పొరేటర్ గాలికావ్య పీఎం సూర్యఘర్ పథకం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి: వాల్ స్ట్రీట్ టెక్ బుల్స్ మళ్లీ రంగంలోకి: 3 శాతానికి పైగా దూసుకెళ్లిన నాస్‌డాక్ ఫ్యూచర్స్ .. ఈ భారీ ర్యాలీకి 3 ప్రధాన కారణాలివే! నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తా -ప్రమాణస్వీకారంలో 65వ డివిజన్ కార్పొరేటర్ కోటకొండ రేవతి గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఏఐ స్టాక్స్‌లో మళ్లీ బుల్ ర్యాలీ..ఏఐ ట్రేడ్: కోర్‌వీవ్ 31%, మైక్రాన్ 17%, ఇంటెల్ 15% జంప్.. త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -ప్రమాణస్వీకారంలో 62వ డివిజన్ కార్పొరేటర్ బండారు పార్థసారధి వాల్ స్ట్రీట్‌లో చారిత్రాత్మక 'మాన్‌స్టర్ ర్యాలీ'..నాస్‌డాక్ 7.5%, డౌ జోన్స్ 1,500 పాయింట్ల జంప్.. చీపురుపల్లి మరింత అభివృద్ధికి సహకరిస్త : బొత్స

డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడుతున్నారా, భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే

Select Suryaa Now
డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడుతున్నారా, భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే

సూర్య హెల్త్ డెస్క్: జలుబు, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు వంటి అనారోగ్య లక్షణాలు కనిపించగానే చాలామంది సొంత వైద్యం వైపు మొగ్గు చూపుతుంటారు. డాక్టర్‌ను సంప్రదించకుండానే మెడికల్ షాపుల్లో నేరుగా యాంటీబయాటిక్స్ కొనుగోలు చేసి వాడుతుండటం సర్వసాధారణమైంది. ఇంట్లో గతంలో ఎప్పుడో మిగిలిపోయిన మందులను సైతం ఎలాంటి వైద్య సలహా లేకుండా మళ్లీ వేసుకుంటుంటారు. అయితే ఇలా ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఆరోగ్యం కుదుటపడకపోగా, భవిష్యత్తులో తీవ్రమైన దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా జలుబు, ఫ్లూ, అనేక రకాల గొంతు నొప్పులు వైరస్‌ల వల్ల వస్తుంటాయి. ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లపై యాంటీబయాటిక్స్ అసలు ప్రభావం చూపవు. అయినప్పటికీ లక్షణాలు కనిపించిన వెంటనే వీటిని వాడటం వల్ల శరీరంలోని హానికర బ్యాక్టీరియా ఆ మందులకు అలవాటుపడిపోయే ప్రమాదం ఉంది. దీనినే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. ఈ పరిస్థితి ఏర్పడితే భవిష్యత్తులో నిజంగా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు సాధారణ మందులు పనిచేయవు. ఫలితంగా వ్యాధి తీవ్రత పెరిగి మరింత శక్తివంతమైన లేదా ఖరీదైన మందులు వాడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందే దుస్థితి కూడా రావొచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

వైద్యుడి పర్యవేక్షణ లేకుండా మందులు వాడే క్రమంలో తప్పు మోతాదు తీసుకోవడం, సూచించిన గడువు పూర్తికాకముందే మధ్యలోనే మందులు ఆపేయడం వంటి పొరపాట్లు జరుగుతుంటాయి. కొద్దిగా ఉపశమనం కలగగానే ఇన్ఫెక్షన్ పూర్తిగా నయమైందని భావించడం సరికాదు. అలాగే గతేడాది మిగిలిన మందులను ప్రస్తుత అనారోగ్యానికి వాడటం, ఇతరులకు సూచించిన ప్రిస్క్రిప్షన్‌ను ఫాలో అవ్వడం వంటివి చాలా ప్రమాదకరం. దీనివల్ల వికారం, కడుపునొప్పి, విరేచనాలు, తీవ్రమైన అలర్జీలతో పాటు పేగుల్లోని మంచి బ్యాక్టీరియా నశించిపోయే అవకాశాలుంటాయి.

స్వీయ వైద్యానికి స్వస్తి పలికి, ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా అర్హులైన వైద్యులను సంప్రదించడం ఎంతో ఉత్తమం. డాక్టర్ సిఫార్సు చేసిన మోతాదు మేరకే, నిర్దేశిత కాలపరిమితి వరకు మాత్రమే యాంటీబయాటిక్స్ వాడాలి. సోషల్ మీడియాలో వచ్చే ఉచిత సలహాలు లేదా పాత ప్రిస్క్రిప్షన్లను అనుసరించి మందులు వాడటం ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.