BREAKING
విజయ్ దేవరకొండ 'రణబాలి' టీజర్ అప్డేట్ వచ్చేసింది డ్రగ్స్‌ కేసులో టీవీ ప్రజెంటర్‌ సహా 12 మందికి మరణ శిక్ష నిర్మాతల మండలి ఎన్నికల్లో మోహన్ వడ్లపట్ల విజయం ‘మన డాక్టర్ బాబే’ చిత్రం నుంచి ‘సోగ్గాడిలా’ మెరిసే సాంగ్ విడుదల సరిహద్దు గ్రామాల ప్రగతికి ప్రాణవాయువు 'వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్' గోల్డ్ స్పాట్ గ్లింప్స్ విడుదల “ఈ పదవి మహిళలు లభించిన గౌరవం” ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోవడంలో వ్యాపారాలకు ప్రభుత్వ మద్దతుతో కూడిన రుణాలు ముఖ్యమంత్రి దృష్టి బొమ్మ దగ్ధం... శ్రీధర్ గాదె కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం రూ. 1.10 లక్షల కోట్ల రక్షణ కొనుగోళ్లకు డీఏసీ ఆమోదం ‘చెప్పారంటే చేసి చూపిస్తారు’ నర్సాపూర్‌లో ఘనంగా ప్రజా పాలన 1,000 రోజుల విజయోత్సవ వికాస్ యాత్ర IT, మెటల్, PSU బ్యాంక్ షేర్ల పతనంతో నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ '90s' వెబ్ సిరీస్ మేజిక్ రిపీట్ చేసేందుకు ఆదిత్య హాసన్ సిద్ధం

‘మన డాక్టర్ బాబే’ చిత్రం నుంచి ‘సోగ్గాడిలా’ మెరిసే సాంగ్ విడుదల

Select Suryaa Now
‘మన డాక్టర్ బాబే’ చిత్రం నుంచి ‘సోగ్గాడిలా’ మెరిసే సాంగ్ విడుదల

కృతాక్షి నిర్మాణంలో తెరకెక్కుతున్న విలేజ్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన డాక్టర్ బాబే’ సినిమాతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో మోహన సిద్ది, శ్రుతి శంకర్ హీరోయిన్లుగా నటిస్తుండగా, తెరు చలపతి కుమార్ పువ్వల కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయగా, తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ‘సోగ్గాడిలా’ అంటూ సాగే సరికొత్త రొమాంటిక్ మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు.

గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ ‘సోగ్గాడిలా’ పాట ఎంతో ఆహ్లాదకరంగా సాగుతుంది. హీరో చుట్టూ హీరోయిన్ తిరుగుతూ చేసే అల్లరి, ఇద్దరి మధ్య ఉన్న క్యూట్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఇన్‌స్టంట్‌గా కట్టిపడేస్తున్నాయి. గిరిధర్ రాగోలు అందించిన అర్థవంతమైన సాహిత్యానికి, లిప్సిక మరియు సుధాన్షు గాత్రం మరింత ప్రాణం పోశాయి. సంగీత దర్శకుడు మనోజ్ కుమార్ బూసం అందించిన క్యాచీ ట్యూన్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్ ని టార్గెట్ చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రంపై సాంగ్స్ ద్వారా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన భావోద్వేగాలు, కడుపుబ్బా నవించే కామెడీ అంశాలతో ఈ సినిమా ఉండబోతుందని మేకర్స్ తెలియజేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.