BREAKING
చంద్రుగొండలో ఉచితంగా ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం మధ్యంతర ఎన్నికల ప్రచార హోరు..అయోవా, కాన్సాస్‌లలో ట్రంప్ పర్యటనలు చైనా-ఒమన్ మధ్య సత్సంబంధాలు...చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వ్యాఖ్యలు యువతే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయం.. అమీన్పూర్ లో గుట్టు రట్టైన మత్తు వ్యాపారం సిక్కింలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పర్యటన ఇస్రో విజయవంతంగా నింగిలోకి ఎన్వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహం మురసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్‌లు జారీ అల్పాహారంతో విద్యార్థులలో పోషక విలువలు పెరుగుతాయి: గ్రామ సర్పంచ్ నాగరాజు యాదవ్ స్ట్రాంగ్ రూములు పరిశీలించిన అధికారులు మిశ్రమ సంకేతాల వేళ ఒక శాతం లాభంతో ప్రారంభమైన సూచీలు నేడే ఆంధ్రప్రదేశ్‌ తీరానికి తీవ్ర తుపాను ‘మురసు’ స్పెయిన్ పర్యటనకు కేంద్ర మంత్రి పబిత్రా మార్గెరెటా సింజెంటా ఐపీఓ వాల్యుయేషన్‌పై విశ్లేషకుల పెదవి విరుపు ఆసియాకు ముడి చమురు దిగుమతులు మళ్లీ యుద్ధానికి ముందు స్థాయికి స్టాక్ మార్కెట్లలో బుల్ రన్.. 800 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్, 23,350 దిశగా నిఫ్టీ.. 6% జంప్ చేసిన రిలయన్స్, ఐటీసీ ఫలితాలపై దృష్టి!

'నాకు పెళ్లి వయసొచ్చింది' పాట పాడిన సంగీత దర్శకుడు అనిరుధ్!

Select Suryaa Now
'నాకు పెళ్లి వయసొచ్చింది' పాట పాడిన సంగీత దర్శకుడు అనిరుధ్!

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌ల వివాహం గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాహ వార్తల మధ్య అనిరుధ్ ఒక వేదికపై సరదాగా పాడిన పాట నెట్టింట వైరల్‌గా మారింది.

ఒక లైవ్ ఈవెంట్‌లో పాల్గొన్న సమయంలో ప్రేక్షకులు 'కావ్య.. కావ్య..' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారి నినాదాలకు అనిరుధ్ స్పందిస్తూ, తను స్వరపరిచిన హిట్ సాంగ్ 'ఎనక్కు ఇప్ప కళ్యాణ వయసు దాన్ వందుడుచు డి' (నాకు ఇప్పుడు పెళ్లి వయసొచ్చింది) అని సరదాగా పాడారు.

అనిరుధ్ ఈ పాట పాడటంతో అక్కడ ఉన్న వారంతా కేరింతలు కొట్టారు. అభిమానులు ఈ సన్నివేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

గత కొన్ని రోజులుగా అనిరుధ్, కావ్య మారన్ ల వివాహం గురించి వార్తలు వస్తున్నప్పటికీ, వీరి వివాహ తేదీ లేదా వేదికపై ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ అనిరుధ్ సమయానుకూలంగా చేసిన ఈ సరదా వ్యాఖ్య అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.