BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

కమల్ హాసన్, ఎస్.యు. అరుణ్ కుమార్ క్రేజీ ప్రాజెక్ట్: వైరల్‌గా మారిన లుక్ టెస్ట్ గ్లింప్స్

Select Suryaa Now
కమల్ హాసన్, ఎస్.యు. అరుణ్ కుమార్ క్రేజీ ప్రాజెక్ట్: వైరల్‌గా మారిన లుక్ టెస్ట్ గ్లింప్స్

టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో ఊహించని క్రేజీ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా మరో సంచలన ప్రాజెక్ట్ అధికారికంగా లాంచ్ అయింది. 'సేతుపతి', 'చిత్తా' వంటి సెన్సేషనల్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎస్.యు. అరుణ్ కుమార్ ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) మరియు టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాాలపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ప్రకటనతో పాటు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ ప్రస్తుతం సినిమా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో కమల్ హాసన్ వైవిధ్యమైన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఒంటిపై నల్లటి షర్టు, ఆలివ్ గ్రీన్ ట్రౌజర్స్ ధరించి, చేతిలో పవర్‌ఫుల్ ఆయుధంతో ఆయన నడుస్తున్న తీరు సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. కూల్ అండ్ ఇంటెన్స్ మేకోవర్‌తో ఉన్న ఈ లుక్ టెస్ట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అరుణ్ కుమార్ టేకింగ్, కమల్ హాసన్ స్టైలిష్ మాస్ ప్రెజెన్స్ ఈ ప్రాజెక్ట్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.