హ్యాపీ జర్నీ రిలీజ్ డేట్ ఫిక్స్.. సెప్టెంబర్ 18న థియేటర్లలోకి కొత్త తరహా సినిమా
రొటీన్ కమర్షియల్ కథలకు భిన్నంగా.. మహిళల భావోద్వేగాలు, సంబంధాలు, జీవిత అనుభవాలను ప్రధానంగా చూపించబోతున్న చిత్రం **‘హ్యాపీ జర్నీ’**. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.ఏడు మంది మహిళల జీవితాలను కేంద్రంగా చేసుకుని ‘హ్యాపీ జర్నీ’ కథ సాగుతుంది. ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక సహాయ పాత్రల్లో కనిపించనున్నారు.
**గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్** బ్యానర్లపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో **అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు**. తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో జీవితాలను మార్చే ప్రయాణం,విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ తాజాగా ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. విమానాశ్రయం బ్యాక్‌డ్రాప్‌లో ప్రధాన తారాగణం అంతా సందడిగా, ఉత్సాహంగా కనిపించేలా ఈ పోస్టర్‌ను రూపొందించారు. ట్రావెల్ బ్యాగులు, విమానం, పేపర్ ప్లేన్ మోటిఫ్‌లు సినిమాకు సంబంధించిన ప్రయాణ నేపథ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
Some Trips Change Plans... Some Change Lives అనే ట్యాగ్‌లైన్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఒక ప్రయాణం కేవలం గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే కాకుండా.. మనుషుల జీవితాల్లో, సంబంధాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాగలదనే అంశాన్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రయాణం కంటే ఎక్కువగా.. భావోద్వేగాల కథ, ‘హ్యాపీ జర్నీ’ కేవలం విదేశీ ప్రదేశాల్లో సాగే ట్రావెల్ స్టోరీ కాదని మేకర్స్ చెబుతున్నారు. అంతర్జాతీయ నేపథ్యాన్ని ఉపయోగించుకుంటూనే.. సంబంధాలు, భావోద్వేగాలు, వ్యక్తిగత అనుభవాలు, అనుకోకుండా ఏర్పడే బంధాలను కథలో కీలకంగా ఆవిష్కరించబోతున్నారు. విభిన్న నేపథ్యాలు, వ్యక్తిత్వాలు కలిగిన ఏడు మంది మహిళలు ఒకే ప్రయాణంలో ఎదుర్కొనే పరిస్థితులు, వారి జీవితాల్లో చోటుచేసుకునే మార్పులు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రతి పాత్రకు ప్రత్యేకమైన కథను అందిస్తూ.. వాటన్నింటినీ ఒక భావోద్వేగ ప్రయాణంగా మలిచినట్లు చిత్ర బృందం చెబుతోంది.
ఇప్పటికే ఆకట్టుకుంటున్న ప్రమోషనల్ కంటెంట్, ఇప్పటికే విడుదలైన ‘హ్యాపీ జర్నీ’ ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా విడుదలైన టీజర్ హార్ట్‌వార్మింగ్ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా విడుదల తేదీ కూడా ఖరారు కావడంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేయనుంది. సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా.. మహిళా పాత్రలు, ప్రయాణం, భావోద్వేగాలు, సంబంధాలను కొత్త కోణంలో చూపించబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.