హనుమాన్ అంశ్ గ్లోబల్ రిలీజ్: అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించనున్న హోంబలే ఫిలిమ్స్ ఆధ్యాత్మిక దృశ్యకావ్యం
భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి, ఊహించని రీతిలో రికార్డులు సృష్టిస్తున్న డివోషనల్ అండ్ స్పిరిచ్యువల్ డ్రామా 'హనుమాన్ అంశ్' ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. బాక్సాఫీస్ వద్ద అనూహ్య వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ ప్రేక్షకులకు అందించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ సిద్ధమైంది. 'కేజీఎఫ్', 'కాంతార' వంటి భారీ పాన్ ఇండియా చిత్రాలతో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన హోంబలే ఫిలిమ్స్, తమ 'హోంబలే ఓవర్సీస్' (Hombale Overseas) డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా ఈ సినిమాను విదేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా (మహారాజ్-జీ) బోధనలు, జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. భారత్‌లో అద్భుతమైన మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ సునామీ సృష్టించిన ఈ చిత్రం, సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓవర్సీస్ ఆడియన్స్‌ను అలరించడానికి వస్తోంది. విశ్వాసం, సేవ, భక్తి ప్రధానాంశంగా సాగే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలోనూ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో వేచి చూడాలి!