ఓటీటీలోకి 'కోర్ట్' శ్రీదేవి రొమాంటిక్ చిత్రం హైకూ.. డిజిటల్ స్ట్రీమింగ్‌పై తాజా అప్‌డేట్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా చిత్రం హైకూ ఓటీటీ విడుదలపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కోర్ట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి అపల్ల ప్రధాన పాత్రలో నటించగా, ఏగన్, ఫెమీనా జార్జ్ కీలక పాత్రల్లో కనిపించారు. అక్టోబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న అనంతరం డిజిటల్ వేదికపై ఎప్పుడు సందడి చేస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కళాశాల జీవితంలోని ఘటనలు, వృత్తిపరమైన సవాళ్లు, ప్రేమ, ఆత్మగౌరవం వంటి అంశాల చుట్టూ ఈ సినిమా కథను ఆసక్తికరంగా మలిచారు.
మనో అనే యువకుడి ప్రయాణం, అతని జీవితంలో ఎదురయ్యే భావోద్వేగ మలుపులను దర్శకుడు సహజత్వంతో తెరకెక్కించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. సిద్ధు కుమార్ సంగీతం, ప్రియేష్ గురుసామి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
హైకూ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ పేరు వినిపిస్తున్నప్పటికీ, ఓటీటీ విడుదల తేదీపై చిత్ర బృందం లేదా స్ట్రీమింగ్ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. థియేటర్లలో ప్రదర్శన ముగిసిన తర్వాత స్ట్రీమింగ్ తేదీ, ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డాక్టర్ డి. అరుళానందు, మథేవో అరుళానందు నిర్మించిన ఈ చిత్రంలో మీమ్ గోపి, ఇందుమతి మణిగండన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. వైవిధ్యమైన ప్రేమకథాంశంతో రూపొందిన హైకూ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనే విషయంపై రానున్న రోజుల్లో అధికారిక అప్‌డేట్ వెలువడే అవకాశం ఉంది.