BREAKING
డ్రగ్స్‌ కేసులో టీవీ ప్రజెంటర్‌ సహా 12 మందికి మరణ శిక్ష నిర్మాతల మండలి ఎన్నికల్లో మోహన్ వడ్లపట్ల విజయం ‘మన డాక్టర్ బాబే’ చిత్రం నుంచి ‘సోగ్గాడిలా’ మెరిసే సాంగ్ విడుదల సరిహద్దు గ్రామాల ప్రగతికి ప్రాణవాయువు 'వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్' గోల్డ్ స్పాట్ గ్లింప్స్ విడుదల “ఈ పదవి మహిళలు లభించిన గౌరవం” ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోవడంలో వ్యాపారాలకు ప్రభుత్వ మద్దతుతో కూడిన రుణాలు ముఖ్యమంత్రి దృష్టి బొమ్మ దగ్ధం... శ్రీధర్ గాదె కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం రూ. 1.10 లక్షల కోట్ల రక్షణ కొనుగోళ్లకు డీఏసీ ఆమోదం ‘చెప్పారంటే చేసి చూపిస్తారు’ నర్సాపూర్‌లో ఘనంగా ప్రజా పాలన 1,000 రోజుల విజయోత్సవ వికాస్ యాత్ర IT, మెటల్, PSU బ్యాంక్ షేర్ల పతనంతో నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ '90s' వెబ్ సిరీస్ మేజిక్ రిపీట్ చేసేందుకు ఆదిత్య హాసన్ సిద్ధం ఏఐ మానవాళి మనుగడకే తీవ్రమైన ముప్పు

గోల్డ్ స్పాట్ గ్లింప్స్ విడుదల

Select Suryaa Now
గోల్డ్ స్పాట్ గ్లింప్స్ విడుదల

'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' చిత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుష్యంత్ కటికనేని కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న సరికొత్త చిత్రం 'గోల్డ్ స్పాట్'. ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్‌పై రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది.

అమ్మను చిన్నప్పుడే కోల్పోయిన తనకు దేవుడు రామ్‌ను పరిచయం చేశాడంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్‌తో ఈ గ్లింప్స్ చాలా భావోద్వేగంగా మొదలవుతుంది. జీవితంలో ఎంతోమంది పరిచయమైనా ఒక్కరే సర్వస్వంగా మారిపోతారనే లైన్‌తో కూడిన సంభాషణలు యువతను, ప్రేమకథలను ఇష్టపడే ప్రేక్షకులను నేరుగా తాకుతాయి. అభిషేక్, కాజల్ చౌదరిల మధ్య కెమిస్ట్రీ మరియు విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ఎమోషనల్ డెప్త్ ఉన్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. గ్లింప్స్‌లో చూపించిన హార్ట్ టచింగ్ మూమెంట్స్ చూస్తుంటే, దర్శకుడు దుష్యంత్ కటికనేని మరోసారి ఒక సున్నితమైన ప్రేమకథను తెరపై అద్భుతంగా ఆవిష్కరించబోతున్నట్లు స్పష్టమవుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్నాయి.