BREAKING
ప్రాథమిక దశలోనే కుష్ఠువ్యాధిని గుర్తించాలి బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం పంపిణీ మున్సిపల్ ఎన్నికల్లో 100 పర్సంట్ స్ట్రైక్ రేటు సాధిస్తాం... * ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఘనంగా మహా చండీ హోమం.... వెస్ట్ బ్యాంక్‌లో ఐరోపా దౌత్యవేత్తలపై దాడిని తీవ్రంగా ఖండించిన ఈయూ మహాదుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారు ఘనంగా దుర్గామాతకు బోనాలు తొమ్మిది రోజుల పాటు అన్నప్రసాద వితరణ విజయవంతం మీ ఇంటి ఆడపిల్లగా ఆశీర్వదించండి....* మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి.... బిటిపిఎస్ లో కార్మిక సంఘ నాయకుని దాతృత్వం బతుకమ్మ వేడుకలు ముగిసినా.. అందని చీరలు! నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేసిన ఎమ్మెల్యే కౌన్ బనేగా క్యాండిడేట్?! సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన అశ్వారావుపేట పోలీసులు* అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ ఆడిన మాజీ చైర్‌పర్సన్

ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి ‘సబ్‌కో’ సాంగ్ రిలీజ్.. యూత్‌ను ఊర్రూతలూగిస్తున్న హేషమ్ మ్యూజిక్

Select Suryaa Now
ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి ‘సబ్‌కో’ సాంగ్ రిలీజ్.. యూత్‌ను ఊర్రూతలూగిస్తున్న హేషమ్ మ్యూజిక్

ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ మ్యూజికల్ జర్నీ మరింత జోష్‌గా సాగుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ నుంచి నాలుగో పాట ‘సబ్‌కో’ తాజాగా విడుదలైంది. ఇప్పటికే సినిమా ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు ఆల్బమ్‌లోని పాటలకు మంచి స్పందన లభిస్తుండగా, ‘సబ్‌కో’ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ‘సబ్‌కో’ పాటను సంజిత్ హెగ్డే, సితార కృష్ణకుమార్ ఆలపించారు. హేషమ్ అందించిన క్యాచీ ట్యూన్, ఎనర్జిటిక్ మ్యూజిక్ పాటకు ప్రత్యేకమైన వైబ్‌ను తీసుకొచ్చాయి. శ్రీ హర్ష ఇమాని ఈ పాటకు సాహిత్యం అందించారు.

గుంటూరులోని VVIT కాలేజీలో విద్యార్థుల సమక్షంలో ‘సబ్‌కో’ పాటను గ్రాండ్‌గా విడుదల చేశారు. విద్యార్థుల సందడి, ఉత్సాహం మధ్య జరిగిన ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఎంతో జోష్‌గా సాగింది. పాట విడుదల సందర్భంగా కాలేజీ ప్రాంగణంలో నెలకొన్న సందడి ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ యూత్ కనెక్ట్‌ను మరోసారి చాటిచెప్పింది.

ఇప్పటికే సోషల్ మీడియాలో ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది. తాజాగా ‘సబ్‌కో’ పాట విడుదలతో ఆల్బమ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకునేలా పాటలోని ఎనర్జీ, మ్యూజికల్ ఫ్లేవర్ ఉండటం విశేషం.

సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం విస్తృత స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు కాలేజీలు, నగరాలను సందర్శిస్తూ విద్యార్థులతో మమేకమవుతున్నారు. అలాగే వరుసగా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.

డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ‘సబ్‌కో’ పాటతో మరింత బజ్ అందుకున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.