BREAKING
ఘనంగా మహా చండీ హోమం.... వెస్ట్ బ్యాంక్‌లో ఐరోపా దౌత్యవేత్తలపై దాడిని తీవ్రంగా ఖండించిన ఈయూ మహాదుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారు ఘనంగా దుర్గామాతకు బోనాలు తొమ్మిది రోజుల పాటు అన్నప్రసాద వితరణ విజయవంతం మీ ఇంటి ఆడపిల్లగా ఆశీర్వదించండి....* మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి.... బిటిపిఎస్ లో కార్మిక సంఘ నాయకుని దాతృత్వం బతుకమ్మ వేడుకలు ముగిసినా.. అందని చీరలు! నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేసిన ఎమ్మెల్యే కౌన్ బనేగా క్యాండిడేట్?! సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన అశ్వారావుపేట పోలీసులు* అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ ఆడిన మాజీ చైర్‌పర్సన్ స్వేరో జిల్లా కమిటీ ఎన్నిక జనసేనకు సముచిత ప్రాధాన్యత కల్పించాలి: ఎమ్మెల్యేకు వినతి చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహం

నెట్‌ఫ్లిక్స్‌ను మెప్పించిన రొమాంటిక్ డ్రామా.. అక్టోబర్ 23న థియేటర్లలోకి 'హైకూ'!

Select Suryaa Now
నెట్‌ఫ్లిక్స్‌ను మెప్పించిన రొమాంటిక్ డ్రామా.. అక్టోబర్ 23న థియేటర్లలోకి 'హైకూ'!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సరికొత్త రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం 'హైకూ' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో డాక్టర్ డి. అరుళానందు మరియు మాథ్యూ అరుళానందు ఈ చిత్రాన్ని నిర్మించారు. యూత్‌ఫుల్ కాలేజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మూవీ ప్రెస్ మీట్‌లో చిత్ర యూనిట్‌తో పాటు ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ పాల్గొని సంతోషాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కోన వెంకట్, సాధారణంగా సినిమాలు పూర్తియ్యాక ఓటీటీ డీల్స్ కుదురుతాయని, కానీ ఈ సినిమా కథ విని షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ హక్కులను సొంతం చేసుకోవడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఈ కథ డిజిటల్ దిగ్గజ సంస్థను ఎంతగానో మెప్పించిందని, కాలేజీ రోజులను మళ్లీ గుర్తుచేసేలా ఒక సిన్సియర్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపుదిద్దుకుందని చెప్పారు. ప్రేమికులను, యువతను ఈ చిత్రం తప్పకుండా అలరిస్తుందని, ముఖ్యంగా హీరోయిన్ శ్రీదేవి నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక కథానాయకుడు ఏగన్ మాట్లాడుతూ, తన ప్రాణప్రదమైన ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నానని, మ్యూజిక్ డైరెక్టర్ సిద్దు కుమార్ అద్భుతమైన స్వరాలను అందించారని తెలిపారు. నటి శ్రీదేవి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి హృదయానికి కనెక్ట్ అయ్యే ప్రేమానుబంధాలు మరియు రిలేషన్‌షిప్‌లోని కాంప్లికేషన్స్‌ను ఈ సినిమాలో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 23న విడుదలవుతున్న ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.