BREAKING
రాత్రి టీవీ చూస్తూ సోఫాలో నిద్రపోతున్నారా? ఈ ముప్పు తప్పదు! ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: తక్కువ ధరకే బియ్యం కొనుగోలు లిమిట్ పెంపు! అరంగేట్ర మ్యాచ్‌లోనే వరల్డ్ రికార్డు సమం చేసిన సౌతాఫ్రికా బ్యాటర్ జోర్డాన్ హెర్మన్! టాలీవుడ్‌లో ఉత్కంఠ రేపుతున్న డాన్సర్స్ అసోసియేషన్ వివాదం: రఘు మాస్టర్, సుమలతతో లేబర్ కమిషన్ చర్చలు! పారా ఆర్చరీలో శీతల్ దేవి సంచలనం: అహ్మదాబాద్ టోర్నీలో స్వర్ణ పతకం కైవసం! వేడివేడి టీ, కాఫీలు తాగుతున్నారా? అయితే ప్రాణాంతక ప్రమాదం ముందే తెలుసుకోండి! ఇంట్లో ఎక్స్‌పైరీ ట్యాబ్లెట్లు ఉన్నాయా? అయితే ఈ పొరపాటు అసలు చేయకండి! సూర్య కొత్త సినిమా 'సీన్' గ్లింప్స్ విడుదల: వైవిధ్యమైన సైకో పోలీస్ పాత్రలో స్టార్ హీరో! ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేడి: ఈ నెల 16న రాజకీయ పార్టీలతో ఈసీ కీలక భేటీ! దేశీ గోవుల పరిరక్షణే లక్ష్యం 100 దేశీ ఆవుల సంరక్షణకు డాక్టర్‌ ఆర్ఎస్ఎస్‌ దేశీ గోశాల కార్యాచరణ బిగ్‌బాస్ 10 తెలుగు: హైరిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్.. ఎలిమినేషన్ టెన్షన్ షురూ! 'దృశ్యం 3' ట్రైలర్ వచ్చేసింది: అజయ్ దేవ్‌గణ్‌ సస్పెన్స్ థ్రిల్లర్ మరోసారి అదుర్స్! భారత్‌లో అత్యంత శక్తివంతమైన మిస్సైల్ ఏదో తెలుసా? నిమిషాల్లో శత్రు దేశాలను బూడిద చేసే ఆయుధం ఇదే! ఓలీ రాబిన్సన్ అరుదైన ప్రపంచ రికార్డు: శతాబ్దపు అత్యుత్తమ బౌలింగ్ సగటు నమోదు! భారీ బడ్జెట్‌తో 'మహేంద్రగిరి వారాహి': గొప్ప డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ఇవ్వబోతున్నాం - నిర్మాత మధు కలిపు

శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలు అస్సలు నచ్చరు.. ఓపెన్‌గా చెప్పిన సందీప్ రెడ్డి వంగా!

Select Suryaa Now
శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలు అస్సలు నచ్చరు.. ఓపెన్‌గా చెప్పిన సందీప్ రెడ్డి వంగా!

టాలీవుడ్ బోల్డ్ అండ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరోసారి తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారారు. సెన్సిబుల్ అండ్ ఎమోషనల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల సినిమాలపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇటీవల జరిగిన ‘ఎపిక్’ మూవీ ఈవెంట్‌లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా సినిమా విశేషాలను పంచుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. శేఖర్ కమ్ముల సినిమాలలో తనకు హీరోలు పెద్దగా నచ్చరని, అయితే ఆయన తెరకెక్కించే హీరోయిన్ పాత్రలు మాత్రం చాలా బాగుంటాయని మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ముఖ్యంగా ‘ఎపిక్’ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ తన సినిమాల్లో ఉండే హీరోల తరహాలో పవర్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పడం తనకు బాగా నచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఇదే వేదికపై తన సినిమా టేస్ట్ గురించి మాట్లాడుతూ.. తెలుగులో క్లాసిక్ లవ్ స్టోరీలంటే తనకు ఎంతో ఇష్టమని, అందులోనూ మణిరత్నం తెరకెక్కించిన ‘గీతాంజలి’ సినిమా అంటే తనకెంతో ప్రత్యేకమైన అభిమానమని మనసులో మాట బయటపెట్టారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సందీప్ వంగా.. తన సినిమాలతో పాటు ఇతరుల చిత్రాలపై ఆయన వ్యక్తం చేసే అభిప్రాయాలు తరచూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారుతుంటాయి.