BREAKING
పామూరు భవిష్యత్తు కోసం కప్పు సాసర్‌కు ఓటేయండి జమ్మూ కాశ్మీర్‌లో 65 మంది విదేశీ ఉగ్రవాదుల సంచారం.. షేక్ హసీనా స్వదేశానికి తిరిగొస్తే అది అప్పగింత అభ్యర్థనకు వేరు:భారత్ స్పష్టీకరణ.. జర్మనీలో సహజ వాయువు నిల్వల పెంపునకు యూనిపర్ రూ. 1,100 కోట్ల పెట్టుబడి: ఎయిర్ ఇండియా–ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాల్లో భారీ మార్పులు: డాయిష్ బ్యాంక్–పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక ఒప్పందం: జర్మనీ రక్షణ సంస్థ హెల్సింగ్ భారీ కొనుగోలుకు సిద్ధం: స్పెయిన్ రక్షణ సంస్థ ఇండ్రా భారీ లక్ష్యం.. 2030 నాటికి 12 బిలియన్ యూరోల ఆదాయం: అమెరికా, చైనాకు పోటీగా యూరప్ భారీ సాంకేతిక పెట్టుబడి నిధి : గూగుల్‌పై మలేషియా ప్రభుత్వం రూ. 1,300 కోట్ల దావా: నేటి రాశి ఫలాలు 26 నవంబర్, 2026 నేటి పంచాంగం26 నవంబర్, 2026 అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలి కోటి దీపోత్సవంలో పాల్గొన్న జగన్నాధుల మణిదీప్ శర్మ అభివృద్ధిపై చర్చకు సిద్ధం

డీజే టిల్లు రేంజ్‌లో వస్తోన్న ‘అనుమాన పక్షి’.. 100 శాతం బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ అంటున్న డైరెక్టర్ విమల్ కృష్ణ!

Select Suryaa Now
డీజే టిల్లు రేంజ్‌లో వస్తోన్న ‘అనుమాన పక్షి’.. 100 శాతం బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ అంటున్న డైరెక్టర్ విమల్ కృష్ణ!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సంచలన విజయం సాధించిన డీజే టిల్లు చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విమల్ కృష్ణ తాజాగా మరో విభిన్నమైన క్విర్కీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొనగా, సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానున్న సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా ఘనంగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ వేదికగా సినిమా విశేషాలను పంచుకున్న మేకర్స్, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో తన పాత్ర తెలుగు తెరపై ఇప్పటివరకు ఎవరూ చూడని విధంగా చాలా యూనిక్‌గా ఉంటుందని హీరో రాగ్ మయూర్ వెల్లడించారు. దర్శకుడు విమల్ కృష్ణ తనకు చెప్పిన కథ విన్నప్పుడే ఎంతో సర్‌ప్రైజింగ్‌గా అనిపించిందని, ఈ సినిమా కోసం తాము తొమ్మిది నెలల పాటు ఎంతో శ్రమించామని తెలిపారు. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. హీరోయిన్ మెరీన్ తన పాత్రతో ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని అన్నారు.

దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ, డీజే టిల్లు సినిమా ప్రేక్షకులను ఏ విధంగా అయితే ఆశ్చర్యపరిచిందో, ఈ అనుమాన పక్షి సినిమా కూడా వంద శాతం అంతకంటే ఎక్కువగా సర్‌ప్రైజ్ చేస్తుందని స్పష్టం చేశారు. ఎడిటర్ చోటా ప్రసాద్ పర్యవేక్షణలో సినిమాలోని కంటెంట్ మరింత ఎనర్జిటిక్‌గా వచ్చిందని, ఈ సినిమాతో రాగ్ మయూర్‌కు మంచి గుర్తింపు దక్కడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల తన 50వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారని, వినోదభరితంగా సాగే ఈ చిత్రం యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు.